Begin typing your search above and press return to search.

లిటిల్ బాస్ కి గ‌బ్బ‌ర్ సింగ్ నిర్మాత బిస్కెట్

By:  Tupaki Desk   |   2 Oct 2019 4:48 AM GMT
లిటిల్ బాస్ కి గ‌బ్బ‌ర్ సింగ్ నిర్మాత బిస్కెట్
X
గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాడు బండ్ల గ‌ణేష్. అయితే గోవిందుడు అంద‌రివాడేలే లాంటి ఫ్లాప్ ని కూడా తీసి అబాసుపాల‌య్యాడు. అయినా అత‌డి ఆశ చావ‌లేదు. రామ్ చ‌ర‌ణ్ .. ప‌వ‌న్ ఎవరో ఒక‌రు ఈ స‌మ‌యంలో ఆదుకోక‌పోరు అన్న ఆశ‌తోనే ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. మెగా హీరోల్ని బండ్ల అంత తేలిగ్గా వ‌దిలి పెట్టేట్టు లేడు. నిర్మాత‌గా తిరిగి బూస్ట్ దొర‌కాలంటే మెగా ఛాన్స్ త‌లుపు త‌ట్టాల‌న్న‌ది అత‌డి ఆశ‌. అయితే అది నెర‌వేరుతుందా? అంటే ఇప్ప‌టికి ఆపసోపాలు త‌ప్ప‌డం లేదు.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా టైమ్ పాస్ చేసిన‌ బండ్ల గణేష్ ఆ తరువాత సినీ నిర్మాతగా మారి పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించి బాగానే వెన‌కేసుకున్నాడ‌ని చెబుతారు. మొన్న ఎన్నిక‌ల్లో రాజకీయాలతో బిజీ గా మారిన బండ్ల గణేష్ సినిమాలను దూరమైనా స‌రైన రీలాంచ్ కోసం వేచి చూస్తున్నాడు. అక్క‌డ ఫెయిల‌య్యాక‌.. తిరిగి సినిమాల దారికే వ‌చ్చాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వరు`లో ఛాన్స్ అందుకున్నాడు. ఇదే అద‌నుగా మెగా సినిమాని నిర్మించాల‌న్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు.

మళ్లీ మీ తో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ.. అంటూ అసలు సంగ‌తిని డైరెక్టుగానే సుత్తి లేకుండా చెప్పాడు బండ్ల ``మ‌రో ఛాన్స్ ఇవ్వండి లిటిట్ బాస్`` అంటూ బండ్ల గణేష్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా రామ్ చరణ్ ను అభ్య‌ర్థించాడు. మ‌రి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న రామ్ చ‌ర‌ణ్ అత‌డి అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నిస్తాడా? అన్న‌ది చూడాలి.