Begin typing your search above and press return to search.

కుమార్తెతో బండ్ల గణేశ్ సంచలనం.. ఆమె అడిగిన 2 కోర్కెల్ని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు

By:  Tupaki Desk   |   6 July 2021 3:56 AM GMT
కుమార్తెతో బండ్ల గణేశ్ సంచలనం.. ఆమె అడిగిన 2 కోర్కెల్ని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లలో ఒకటి బండ్ల గణేశ్. నటుడిగా చిన్న చితకా వేషాలు వేసి.. ఒక మోస్తరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. నిర్మాతగా మారిన తర్వాతే అతగాడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు తీయటం బండ్లకు మాత్రమే సాధ్యమన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపించేది. మాటల పుట్ట మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీని విపరీతంగా భజన చేసే ఆయన.. ఎక్కడకు వస్తే అక్కడ సందడి అన్నట్లు ఉంటుంది.

తాజాగా ఒక టీవీ షోకు వచ్చిన బండ్ల తన మాటలతో అందరి చూపు తన మీద పడేలా చేశారు.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తొలిసారి తన కుమార్తె జనని తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఇంతకీ తన కుమార్తెను టీవీ చానల్ షోకు తీసుకురావటం వెనకున్న అసలు కారణం ఏమిటో చెప్పేశారు. ఇంతకీ బండ్ల గణేశ్.. ఆయన కుమార్తె పాల్గొన్న టీవీ కార్యక్రమం మరేదో కాదు.. ఓంకార్ నిర్వహించే రియాల్టీ షో.

ఈ సందర్భంగా మాట్లాడిన బండ్ల గణేశ్.. తన కుమార్తెను పరిచయం చేస్తూ.. ఆమెకు 18 ఏళ్లు అని. ఇప్పటివరకు తనను రెండే రెండు సార్లు తన కోర్కెల్ని చెప్పిందని.. అందులో ఒకటి పవన్ కల్యాణ్ తో మళ్లీ బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు తీస్తావ్. ఓంకార్ అన్నయ్య షఓకు వెళితే నన్నూ తీసుకెళ్లు అని అడిగిందని చెప్పారు. అందుకే.. తనను తీసుకొచ్చా.. అంటూ బండ్ల చెప్పిన మాటకు ఓంకార్ ఖుషీ ఖుషీ అయిపోయారు. ఎప్పటిలానే తన మాటలతో సంచలనంగా మారే బండ్ల.. తన కుమార్తెను వెంట పెట్టుకొని వచ్చిన సందర్భంలో తన మాటల మేజిక్ తో వార్తల్లోకి వచ్చేశారు. అదీ.. బండ్ల గణేశ్ అంటే.