Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్ ఆడియో లీక్..? త్రివిక్రమ్ మీద సంచలన వ్యాఖ్యలు..?
By: Tupaki Desk | 21 Feb 2022 6:40 AM GMTపవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో.. ఆయన్ను విపరీతంగా ఆరాధించే ప్రముఖుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తాను పవన్ ఫ్యాన్స్ ని కాదని.. పరమ భక్తుడినని బండ్ల చెప్పుకుంటూ ఉంటారు. ఇక పవన్ సినిమా వేదికల మీద బండ్ల స్పీచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటారు.
సందర్భం వచ్చినప్పుడల్లా దేవరా అంటూ తన అభిమాన హీరో మీద అభిమానాన్ని భక్తిని తన వ్యాఖ్యల ద్వారా చాటుకుంటూ ఉంటారు. అందుకే పవన్ ఫంక్షన్స్ లో ఆయన భక్తుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. పవన్ స్పీచ్ కంటే బండ్ల మాట్లాడిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నేడు సోమవారం పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ కోసం పీకే ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వేడుకకు కొన్ని గంటల ముందు పవన్ అభిమానితో బండ్ల మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతుండటం సంచలనంగా మారింది.
లీకైన ఆడియో కాల్ రికార్డింగ్ సంభాషణ ప్రకారం ఓ గుర్తు తెలియని అభిమాని బండ్ల గణేష్ కు ఫోన్ చేసి 'భీమ్లా నాయక్' ఈవెంట్ కు వెళ్తున్నావా? స్పీచ్ ఏమైనా రెడీ చేసుకున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి బండ్ల స్పందిస్తూ.. ముందు వెళ్తున్నానని అన్నారు. ఆ వెంటనే వాళ్లు ఇంకా తనను పిలవలేదని.. స్పీచ్ మాత్రం రెడీ చేసుకొని పెట్టుకున్నానని బదులిచ్చారు.
'త్రివిక్రమ్ గాడు నన్ను రావొద్దన్నదంట.. వాడు డౌన్ అవుతాడని రావొద్దన్నడంట. అదే ఆలోచిస్తున్నా.. నాకేమో వెళ్లాలని ఉంది. డైలాగులు కూడా అద్భుతంగా రాసుకున్నాను' అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు అవతలి వ్యక్తి 'నువ్వు లేకపోతే ఈవెంట్ లో చాలా మిస్ అవుతామన్నా. పిలవకపోయినా వచ్చేయండి' అన్నాడు. పిలవకుండా వస్తే బాగుండదని.. త్రివిక్రమ్ ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నాడని బండ్ల దీనికి బదులిచ్చారు.
''త్రివిక్రమ్ గాడు వైసీపీ వాళ్ళతో కలిసి పెద్ద ప్లాన్ చేసుకున్నాడట. అదీ బాధ'' అంటూ బండ్ల గణేష్ అన్నారు. 'అందరూ అరవండి.. బండ్లన్న ఎక్కడ అని అరిస్తే.. నేను వెంటనే అక్కడకు వచ్చేస్తాను.. రేపు ఆడిటోరియం అంతా బండ్లన్న బండ్లన్న అని అరవండి.. బండ్లన్న రావాలి అని అరవమని జనాలకు చెప్పండి. నేను అక్కడే ఉంటాను. వెంటనే స్క్రీన్ మీదకు వచ్చేస్తాను' అని గణేష్ సలహా కూడా ఇచ్చారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత అనే చర్చ జరుగుతోంది. ఎక్కువ శాతం మంది అది ఫేక్ ఆడియో అని అంటున్నారు. కానీ ఆ వాయిస్ మాడ్యులేషన్ బండ్లదే అని మరికొందరు అంటున్నారు. అయితే 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు ఇలాంటి ఆడియో ఫైల్ బయటకు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.
వాస్తవానికి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులుగా పిలవబడే అతికొద్ది మందిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - నిర్మాత బండ్ల గణేష్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో గణేష్ కు త్రివిక్రమ్ కు పొసగడం లేదనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఓ ల్యాండ్ డీలింగ్ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. అప్పటి నుంచి పవన్ - త్రివిక్రమ్ ల దగ్గర బండ్ల కనిపించడం మానేసారని ఊహాగానాలు వచ్చాయి.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పథకం ప్రకారం తనను 'బీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకుండా చేస్తున్నారంటూ బండ్ల గణేష్ పేరుతో వచ్చిన ఆడియో కాల్ మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది. దీంట్లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వైసీపీ వాళ్లతో కలిసి త్రివిక్రమ్ ఏదో చేస్తున్నారనే అర్థం వచ్చెేలా మాట్లాడం హాట్ టాపిక్ అయింది. ఇక ఆదివారం రాత్రి నుంచి బండ్ల ట్విట్టర్ లో పెట్టే కోట్స్ ని బట్టి పరోక్షంగా ఏదో చెప్పాలని చూస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.