Begin typing your search above and press return to search.

మరోసారి 'మెగా'భిమానాన్ని చాటుకున్న బండ్ల..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 3:27 PM GMT
మరోసారి మెగాభిమానాన్ని చాటుకున్న బండ్ల..!
X
నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ మెగా ఫ్యామిలీ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపుతుంటారనే విషయం తెలిసిందే. తనని తాను పవన్ కళ్యాణ్ భక్తుడిగా ప్రకటించుకున్న బండ్ల.. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణమని చెబుతాడు. ఎన్నో సందర్భాల్లో తన మెగాభిమానాన్ని చాటుకున్నారు. లేటెస్టుగా చిరు ఫోటోను ఉద్దేశిస్తూ బండ్ల చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. తాజాగా ఓ ఫోటో షూట్ చేశారు. వివిధ స్టైల్స్ లో పోజులిచ్చిన చిరు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బిగ్ బాస్ స్టైల్ కి బండ్ల గణేష్‌ ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్లు మెగా ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్నాయి.

చిరంజీవి ఫోటోని షేర్ చేసిన బండ్ల గణేష్.. "ఈ స్టైల్‌ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం.. ఈ స్టైల్‌ చూసే మేం సినిమా రంగం వైపు పరుగులు తీశాం.. ఈ స్టైల్‌ చూసే మా జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది.. ఇక్కడ ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకం కల్పించుకున్నాం"అని ట్వీట్ చేశారు.

"ఈ స్టైల్‌ చూసే ఇక్కడ ఎవరైనా.. ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చాం. ఈ స్టైల్‌ చూసే అందరం మీకు అభిమానులుగా మారిపోయాం. మీరు ఎప్పటికి ఈ స్టైల్‌ లోనే ఉండాలని మా కోరిక.. ఎందరికో భరోసా. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్‌ అంటే మాకు ఇష్టం" అని పేర్కొన్నారు బండ్ల. చిరంజీవిని ఉద్దేశించి బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ - బండ్ల గణేష్ మధ్య దూరం పెరిగిందని.. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదీ బాగాలేదని టాక్ వినిపిస్తోంది. 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల రాకపోవడానికి కారణం కూడా ఇదేనని.. దీని వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడంటూ రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ బండ్ల సంచలన వ్యాఖ్యలు చేసారంటూ కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.

కాకపోతే ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఎప్పటిలాగే ట్వీట్లు పెడుతూ వచ్చారు. కానీ ఒకప్పటిగా ఆయన్ని స్తుతించడం కాస్త తగ్గించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ని పొగుడుతూ ట్వీట్ పెట్టడంతో బండ్ల ఫోకస్ ఇటు మళ్లించారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇకపోతే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియడం లేదు.. చిరంజీవి తో మూవీ సెట్ చేయమని మెగా అభిమానులు బండ్ల ను కోరుతున్నారు. ఇప్పుడు ఎలాగూ మెగాస్టార్ వరుసగా సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. మరి త్వరలోనే పరమేశ్వర బ్యానర్ లో మెగా మూవీ ఉంటుందేమో చూడాలి.