Begin typing your search above and press return to search.
నంది రచ్చకు సొల్యూషన్ ఇదేనట
By: Tupaki Desk | 17 Nov 2017 8:37 AM GMTనంది అవార్డుల ప్రకటన భారీ వివాదానికి తెర తీయటంతో పాటు.. ఇండస్ట్రీలో ఇప్పటివరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేదాలు రోడ్డున పడ్డాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు.. వ్యాఖ్యలు చేసుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నంది అవార్డుల ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన వారిని.. మరి.. ఈ వివాదానికి ముగింపు ఏమిటి? అని అడిగినప్పుడు ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.
నంది పురస్కారాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించాలని.. అవార్డుల్ని తిరిగి ప్రకటించాలన్నారు. అయినా.. జ్యూరీ మెంబర్లు చర్చలకు రావటం నూటికి నూరు శాతం తప్పుగా చెబుతున్నారు. నంది అవార్డుల్లో జరిగిన తప్పులను సరిదిద్దాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నంది అవార్డుల మీద ఇన్ని మాట్లాడుతున్నారు కదా.. చివరకు మీరేం కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నకు బండ్ల గణేశ్ అండ్ కోలు చేసిన డిమాండ్లు చూస్తే..
1. అక్కినేని నాగేశ్వరరావు ఉత్తమ కుటుంబ కథా చిత్రం కేటగిరి అవార్డును ప్రకటించాలి
2. మనం సినిమాకు నాగేశ్వరరావుగారికి అవార్డు ఇవ్వాలి
3. రుద్రమదేవికి పురస్కారం దక్కాల్సిందే
4. రుద్రమదేవిలో నటించిన అల్లుఅర్జున్ కు అవార్డు ఇవ్వాల్సిందే
తాము చేసిన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి.. అవార్డుల్ని సవరిస్తే న్యాయం చేసినట్లు అని.. ఒకవేళ సవరించకుండా ఉంటే మాత్రం తీరని అన్యాయం చేసినట్లేనని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. మరి.. బండ్ల డిమాండ్లకు నంది అవార్డుల జ్యూరీ రియాక్షన్ ఏమిటో కాలమే తేల్చాలి.