Begin typing your search above and press return to search.
పవన్ ఫోటోని తొలగించిన బండ్ల.. ఎవరినీ నమ్ముకోవద్దంటూ ట్వీట్..!
By: Tupaki Desk | 20 Jun 2022 7:43 AM GMTనటుడు, నిర్మాత బండ్ల గణేష్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు తనకు తాను భక్తుడిగా ప్రకటించుకున్న బండ్ల.. దేవర అంటూ ఆరాధిస్తుంటారు.
మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై ఫ్యాన్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ కుదిరినప్పుడల్లా తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. స్టేజీ మీదెక్కి ఆవేశంగా ప్రసంగాలు చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. బండ్ల స్పీచ్ కోసం ఆతృతగా వేచి చూసే ఫ్యాన్స్ ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
అయితే గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ - బండ్ల గణేష్ మధ్య దూరం పెరిగిందని.. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదీ బాగాలేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
బండ్ల గణేష్ ఇంట్లో హాల్ లో గోడపై పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి ఉంటుందనే విషయం ఆయన్ని ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. 'గబ్బర్ సింగ్' టైంలో పవన్ తో బండ్ల తీసుకున్న ఫోటో అది. అయితే ఇప్పుడు పవన్ ఫోటోని అక్కడి నుంచి తొలగించి.. బండ్ల తన తల్లిదండ్రుల ఫోటోని పెట్టినట్లు తెలుస్తోంది.
నన్ను ఆశీర్వదించండి అంటూ బండ్ల గణేష్ ఓ ఫోటో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలియవచ్చింది. అందులో ఒకప్పుడు పవన్ ఫోటో ఉన్న ప్లేస్ లో ఇప్పుడు అతని తల్లిదండ్రుల ఫోటో ఉండటాన్ని మనం గమనించవచ్చు.
పవన్ కు డై హార్డ్ ఫ్యాన్ ఆయన ఫోటోనే తీసేయండంతో ఇద్దరి మధ్య ఏమైంది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. దేవర ఫోటో ఎందుకు తీసేసారు అంటూ బండ్లను ప్రశ్నిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. దీనికి తోడు బండ్ల ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఆడియో కూడా ఎన్నో సందేహాలకు దారితీసింది.
'జీవితంలో ఎవరినీ నమ్ముకోవద్దు.. మీ తల్లి దండ్రులని నమ్మండి.. నిన్ను నమ్మి నీతో వచ్చిన మీ భార్యని ప్రేమించండి.. వారికి మంచి జీవితాన్ని ఇద్దాం. మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం.. వాళ్ళ వీళ్ళ మోజులో పడి మన పిల్లలకు మనల్ని నమ్ముకున్నవారికి అన్యాయం చెయ్యొద్దు' అంటూ బండ్ల గణేష్ ఈ ఆడియోలో నిరాశలో మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.
బండ్ల గణేష్ ఉన్నట్టుండి ఇలా వేదాంత ధోరణిలో ఎందుకు మాట్లాడుతున్నారు? జీవితంలో ఎవరినీ నమ్మొద్దు అంటూ ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళ వీళ్ళ మోజులో పడొద్దని వ్యాఖ్యానించడంతో అంతర్యం ఏంటి? అని అందరూ ఆలోచిస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో కూడా గందరగోళం మొదలైంది.
'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో బండ్ల గణేష్ .. పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆడియోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. తనని ప్రీరిలీజ్ ఈవెంట్ కి రానివ్వకుండా త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి తగ్గట్టుగానే పవన్ ఈవెంట్ లో బండ్ల కనిపించలేదు.
అయినప్పటికీ ఆ తర్వాత పవన్ ను స్తుతిస్తూ బండ్ల రెగ్యులర్ గా ట్వీట్లు పెడుతూ వచ్చారు. పవన్ ను సీఎంగా చూడాలంటూ జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేశారు కూడా. అయితే ఏంజరిగిందో ఏమో కానీ బండ్ల గణేష్ సడన్ గా పవన్ ఫోటోని తీసేయండం.. జీవితంలో ఎవరినీ నమ్ముకోవద్దని బాధతో చెబుతున్నారు. ఇలా సడన్ గా బండ్లలో ఇలాంటి మార్పు రావడానికి కారణమేంటో మరి!