Begin typing your search above and press return to search.
ఆ 'ట్వీట్' వెనక బండ్ల అర్ధమేంటి..??
By: Tupaki Desk | 1 Jun 2021 10:30 AM GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు పక్కనపెట్టి మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీ కాకముందే వరుసగా చేతినిండా ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసాడు. ప్రస్తుతం వాటిలో ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ వస్తున్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినటువంటి వకీల్ సాబ్ మూవీ అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఆ సినిమా అనంతరం పవర్ స్టార్ మలయాళం 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే పీరియడిక్ మూవీ చేస్తున్నాడు.
ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో పవన్ ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఏకే రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ గా నటిస్తుండగా ఆయనకు పోటీగా రానా నటిస్తున్నాడు. వీరమల్లు సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేస్తానంటూ వార్తలలో నిలిచాడు యాక్టర్ కం ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. పవన్ తో సినిమా చేయాలనేది అతని చిరకాల కోరికగా చెబుతుంటాడు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం దెబ్బతిన్నట్లు కనిపించినప్పటికీ.. అలాంటివి ఏం లేవని వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ వేడుకల్లో హల్చల్ చూస్తే అర్ధమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ మరోసారి సినిమా చేయాలనీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట.
ఈ విషయం పక్కనపెడితే.. పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కొడుకు అకిరా నందన్ తో కలిసి దిగినటువంటి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి 'నా దేవుడు పవన్ - నా హీరో అకిరా' అన్నట్లుగా కాప్షన్ జోడించాడు. అంతే అప్పటినుండి ఇండస్ట్రీ వర్గాలలో అభిమానుల్లో బండ్ల గణేష్ మరో మూవీ లైన్ చేసాడేమో అంటూ సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కొడుకును లాంచ్ చేస్తాడేమో అని వార్తలొచ్చాయి. తాజాగా నా హీరో అకిరా అనే పోస్టు చూసేసరికి ఫ్యాన్స్ లో సినీవర్గాలలో సందేహాలకు బలం వచ్చినట్లు అయింది. మరి నిజంగానే బండ్ల మెల్లగా పవన్ తో చర్చలు జరిపి అకిరాను ఇంట్రడ్యూస్ చేస్తాడేమో అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చూడాలి మరి బండ్ల ఏ కబురు చెబుతాడో..!