Begin typing your search above and press return to search.

తండ్రితో విజయ్.. బండ్లన్న ఫొటో కౌంటర్?

By:  Tupaki Desk   |   12 Dec 2022 4:02 AM GMT
తండ్రితో విజయ్.. బండ్లన్న ఫొటో కౌంటర్?
X
విజయ్ దేవరకొండ ఆదివారం రోజు చల్లటి సాయంత్రం వేళ తన తండ్రితో కూర్చుని మాట్లాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ చిన్న నిక్కరులో తండ్రి ముందు కాళ్లు చాపి చాలా ఫ్రెండ్లీగా కూర్చున్నట్లు అనిపించింది. అయితే ఆ ఫోటోను చూసిన కొందరు నెటిజన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనే విధంగా కామెంట్ చేశారు.

అయితే మరి కొందరు మాత్రం తండ్రి అంటే కొంచెం కూడా మర్యాద లేదా ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం అనే విధంగా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. తన తండ్రికి సేవలు చేస్తూ ఉన్న మరొక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అందులో బండ్ల గణేష్ లాక్ డౌన్ సమయంలో తన తండ్రికి తనే స్వయంగా హెయిర్ కటింగ్ చేస్తూ ఉన్నాడు. అంతే కాకుండా ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

మనకి ఈ ప్రపంచాన్ని చూసి అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం.. అంటూ విజయ్ దేవరకొండ ఫోటోకు కౌంటర్ ఇచ్చినట్లుగా బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు.

ఇక ఈ ట్వీట్ పై కూడా సోషల్ మీడియాలో మరింత కాంట్రవర్సీ అవుతుంది. అనవసరంగా ఎందుకు విజయ్ దేవరకొండ ఫోటో పై ఆ విధంగా కౌంటర్ ఇస్తున్నారు అతను అతని తండ్రితో ఆ విధమైన ప్రేమతో ఉండి ఉండవచ్చు కదా అనే విధంగా మరి కొంతమంది స్పందిస్తున్నారు.

ఇక మళ్లీ బండ్లన్న ఏమనుకున్నాడో ఏమో కానీ అదే పోస్ట్ పై స్పందిస్తూ ఇలాంటి ఫోటోను నాకు గుర్తు చేసినందుకు విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు అని మరో వివరణ ఇచ్చాడు. దీంతో అది కాస్త మరింత వైరల్ గా మారింది.

అసలు బండ్ల గణేష్ పోగొడుతున్నాడా తిడుతున్నాడా అని మరికొందరు కన్ఫ్యూజన్ కు గురి అవుతున్నారు. మరి ఈ ఫోటో కాంట్రవర్సీపై విజయ్ దేవరకొండ ఇలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి. ఇక విజయ్ తదుపరి సినిమా ఖుషి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.