Begin typing your search above and press return to search.
న్యాయ పోరాటం చేస్తా - బండ్ల గణేష్
By: Tupaki Desk | 25 Nov 2017 11:43 AM GMTనిర్మాత బండ్ల గణేష్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాడు. గబ్బర్ సింగ్.. టెంపర్.. ఇద్దరమ్మాయిలతో.. గోవిందుడు అందరివాడేలే.. వంటి సినిమాలను తీశాడు. ఇప్పుడు కాస్త ఫైనాన్షియల్ గా దెబ్బతినడంతో సినిమాలు తీయట్లేదు అనేదే టాక్. అయితే టెంపర్ సినిమా రచయిత వక్కంతం వంశీకి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో.. అతడికి ఆర్నెల్ల జైలు శిక్ష.. మరియు ఫైన్ వేసింది కోర్టు. దీనిపై వెంటనే బెయిల్ పొందాడు. కాని 25 లక్షల చెక్కు విషయంలో.. 16 లక్షలు ఆల్రెడీ కట్టేసినా కూడా.. 9 లక్షల కోసం ఏకంగా జైలే శిక్షను కొని తెచ్చుకున్నాడా? చాలామంది ఇదే సందేహం వచ్చింది. ఇప్పుడు అందరికీ బండ్ల తన వర్షన్ ఏంటో వినిపించాడు.
ఈ విధంగా చెప్పాడు బండ్ల గణేష్...
2015 టెంపర్ చిత్రం వివాదం ఇది. కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుండి కొనడం జరిగింది.సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టి కి సంయుక్తంగా విక్రయించము. కానీ నాకు తెలియకుండా టెంపర్ నవల హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మాడు దీనివలన నేను తీవ్ర మనస్తాపానికి లోనై ఇ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టి కి తీసుకు వచ్చాను.
అదే సమయం లో టెంపర్ చిత్ర కథ కి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశాను. ఈవివాదం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నప్పటికీ వంశీ చెక్ ను పట్టుకొని కోర్టు కి వెళ్ళాడు నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను ఈ విషయం పై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్ కు వెళ్తున్నాను రచయిత వంశీ పై నా న్యాయ పోరాటం సాగిస్తాను.
టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో ఏమిటో నాకు - నా సినిమా యూనిట్ - సినిమా సహాయ రచయితలకు - వంశీ మనసాక్షికి తెలుసు.....
సినిమా రంగంలో నటులకు - దర్శకుల - సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితి లో లేనా? నా అభిమానులు - ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు.
మీ బండ్ల గణేష్.