Begin typing your search above and press return to search.
రీల్ సీన్ ను రియల్ గా చేసి చూపించిన బండ్ల గణేశ్
By: Tupaki Desk | 7 Sep 2021 4:08 AM GMTబండ్ల గణేష్.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. చాలా తెలివిగా మాట్లాడినట్లుగా మాట్లాడుతూనే.. అప్పుడప్పుడు తన చేష్టలతో కామెడీని పండించే ఆయన.. సీరియస్ గా చాలానే నిర్ణయాల్ని ఫట్.. ఫట్ మని తీసేసుకుంటారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలనం.. ఆయన నోటి నుంచి మాట వస్తే..అదో హాట్ టాపిక్ గా మారటం చూస్తూనే ఉంటాం.
గడిచిన కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ (మా) కు జరగాల్సిన ఎన్నికల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటం.. వివిధ అంశాలు మీడియాలో రావటం తెలిసిందే. తాజాగా ఒక చానల్ పెట్టిన చర్చా కార్యక్రమానికి హాజరైన బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లైవ్ లోనే రియల్ సినిమా సీన్ చూపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మొదట తాను ప్రకాశ్ రాజ్ ప్యానల్ అని చెప్పుకున్న బండ్ల గణేశ్.. తాజాగా ఆయన ప్యానల్ లోకి జీవిత రాజశేఖర్ రావటాన్ని ఇష్టపడటం లేదు. ఆ విషయాన్ని మనసులోనే దాచి పెట్టుకోకుండా.. ఓపెన్ గా బయటకు కక్కేశారు. అంతేనా.. లైవ్ లో ఆమెతో మాట్లాడిన ఆయన.. ‘అక్క ఆశీస్సులు కావాలి’ అని కోరటం గమనార్హం.
ఇంతకీ ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నట్లు? అన్న ప్రశ్నకు ఆయన సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ‘‘ఆవిడ ఇప్పటికే ‘మా’ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆవిడ ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోకి రావటం ఇష్టం లేదు. వ్యక్తిగతంగా జీవితతో నాకెలాంటి విభేదాలు లేవు. ఆమె నాకు అక్క లాంటిది. తనంటే ఎంతో గౌరవం ఉంది. నేను బాగా అభిమానించే వారిని విమర్శించటం నాకు నచ్చలేదు. ఆవిడ బాగా పని చేసి ఉంటే.. మళ్లీ ఎన్నికలు నిర్వహించటం ఎందుకు? అదే ప్యానల్ ను కొనసాగించొచ్చు కదా? ఇప్పుడు జీవితను ప్యానెల్ లోకి తీసుకోవట అటు ప్రకాశ్ రాజ్ కు న్యాయం కాదు. అందుకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలి. ఇది ఆకాంక్ష కాదు.. న్యాయపోరాటం’గా అభివర్ణించారు.
గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయని.. దాదాపు 90 శాతం పోల్ ఖాయమన్నారు. జీవిత మీద బండ్ల గణేశ్ చానల్ లో మాట్లాడిన సందర్భంలోనే.. సదరు చానల్ వారు జీవితను లైవ్ లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కూడా బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై రియాక్టు అయ్యారు. ‘బండ్ల గణేష్ కు నాకు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. ‘మా’ లో ఈసారి వర్గాలు ఏర్పడ్డాయి. సరైన కోఆర్డినేషన్ లేదు. అందుకే పదవిలో ఉండి ఏం చేయలేకపోయా. నరేశ్.. శివాజీరాజాల విషయంలో సమన్వయం మిస్ అయ్యింది. ప్యానల్ సభ్యులంతాఒక మాట మీద ఉంటే ఏమైనా చేయగలం. గతంలో చేయలేని పనుల్ని ఈసారి చేయాలుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
అంతేకాదు.. ప్రకాశ్ రాజ్ ఆలోచనలతో తను..తన భర్త ఆలోచనలు కలిసినట్లుగా ఆమె చెప్పారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై జీవితం సుదీర్ఘంగా సమాధానం ఇస్తున్న వేళ.. లైవ్ లో ఉన్న ఆమెను ఉద్దేశించి బండ్ల గణేష్.. ‘అక్కా నీ మీద నేను గెలుస్తా. నాకు నీ ఆశీస్సులు కావాలి’ అని బండ్ల గణేష్ అనటంతో షోలో నవ్వులు విరబూశాయి. మరి.. బండ్ల గణేష్ చెప్పినట్లే చేస్తారా? లేదంటే మరేదైనా ట్విస్టు ఇస్తారా? అన్నది కాలమే బదులివ్వాలి.