Begin typing your search above and press return to search.
బ్యాంగ్ బ్యాంగ్.. ట్రెండీగా ఉందే
By: Tupaki Desk | 5 May 2019 11:39 AM GMTనిఖిల్ సిద్ధార్థ్.. లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం 'అర్జున్ సురవరం. తమిళ సూపర్ హిట్ చిత్రం 'కనిదన్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఒరిజినల్ డైరెక్టర్ సంతోష్ దర్శత్వం వహించాడు. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి 'బ్యాంగ్ బ్యాంగ్' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సామ్ సిఎస్. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు వరికుప్పల యాదగిరి. పాడిన వారు సామ్ సిఎస్. "దొరికావంటే నీ లైఫే బ్యాంగ్ బ్యాంగ్.. ఉరికించేస్తా ఉచ్చులోకి బ్యాంగ్ బ్యాంగ్ చిక్కావంటే చేతిలోకి బ్యాంగ్ బ్యాంగ్.. ఉతికారేస్తా గల్లపట్టి బ్యాంగ్ బ్యాంగ్" అంటూ క్యాచీ లిరిక్స్ తో యాదగిరి సాహిత్యం అందించగా ప్రతి ఒక్కరూ సులువుగా హమ్ చేయగలిగే విధంగా సింపుల్ ట్యూన్ తో స్వరపరిచాడు సంగీత దర్శకుడు. ఓవరాల్ గా సాంగ్ మెప్పించేదిగా ఉంది.. ట్రెండీగా సాగింది.
'అర్జున్ సురవరం' చిత్రాన్ని మొదట మే 1 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ 'అవెంజర్స్' ప్రభంజనం చూసి వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని టీమ్ మెంబర్స్ అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యేలోపు.. ఈ బ్యాంగ్ బ్యాంగ్ పై ఒక లుక్కేయండి.