Begin typing your search above and press return to search.

చెన్నయ్‌ బాబుల బెంగుళూర్‌ డేస్‌ షురూ

By:  Tupaki Desk   |   18 March 2015 12:27 PM GMT
చెన్నయ్‌ బాబుల బెంగుళూర్‌ డేస్‌ షురూ
X
మన బెంగుళూర్‌ డేస్‌ ఎలా ఉంటాయో తెలియదు కాని.. చెన్నయ్‌ బాబుల బెంగుళూరు డేస్‌ మాత్రం స్టార్ట్‌ అయిపోయాయ్‌. ఇకపోతే ఎప్పటినుండో జనాలు నోటిలో నానుతున్న ఈ సినిమా పేరు ''బెంగుళూరు డేస్‌''.. ఇదొక మలయాళం సినిమా. ఈ సినిమా బాగా హిట్టవ్వడానికి కారణం ఇదొక న్యూ ఏజ్‌ రిలేషన్స్‌ కమ్‌ ఫ్రెండ్‌షిప్‌ స్టోరీ. దీనిని రీమేక్‌ చేయాలని తెలుగు, తమిళ రైట్స్‌ను దిల్‌ రాజు, పివిపి సంయుక్తంగా కొన్నారు. అయితే కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమాను తమిళంలో పివిపి, తెలుగులో దిల్‌ రాజు సెపరేట్‌ సెపరేట్‌గా రీమేక్‌ చేస్తున్నారని టాక్‌.

ఇకపోతే ఈరోజే తమిళ వర్షెన్‌కు కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాలో ముఖ్యమైన ముగ్గురు స్నేహితులు కమ్‌ కజిన్స్‌గా రానా, ఆర్య, శ్రీదివ్యలు నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాను తమిళంలో తీస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో వరుసగా ఫ్లాపులు తీసి చేతులు కాల్చుకున్న భాస్కర్‌.. ఇప్పుడిక ఈ రీమేక్‌తో తమిళంలో సెట్టవుతాడేమో చూడాలి. ఇక తమిళంలో ఎలాగో ఆర్య, శ్రీదివ్యలకు నేమ్‌ బాగానే ఉంది కాని, రానా దగ్గుబాటి మాత్రం గతంలో ఆరంభం వంటి సినిమాలతో జస్ట్‌ మార్కులు వేయించుకున్నాండంతే. ఈసారి కాస్త హిట్టు కొట్టాల్సిందే మరి.