Begin typing your search above and press return to search.
బంగార్రాజు ఇప్పటి వరకు సూపర్.. ఇక మీదటే చూడాలి!
By: Tupaki Desk | 18 Jan 2022 11:32 AM GMTనాగార్జున మరియు నాగ చైతన్యలు హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి పాజిటివ్ రివ్యూను దక్కించుకుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమీ లేవు. విడుదల అయిన చిన్న సినిమాలు పెద్దగా సక్సెస్ టాక్ దక్కించుకోలేదు. దాంతో తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి సంబరంకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బంగార్రాజు మాత్రమే. బంగార్రాజు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. వీక్ డేస్ అయిన సోమవారం కూడా మంచి వసూళ్లను దక్కించుకోవడంతో బ్రేక్ ఈవెన్ కు చేరువ అయ్యింది. ఏపీ లో నిన్నటి వరకు సాదారణ పరిస్థితులు ఉన్నాయి. కాని నేటి నుండి అక్కడ నైట్ కర్ఫ్యూ మరియు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని అమలు చేయబోతున్నారు.
ఏపీ నుండి సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లను మొదటి నాలుగు రోజుల్లో సాధించేందుకు ప్రయత్నించిన మేకర్స్ సక్సెస్ అయ్యారు. అక్కడ నుండి భారీ ఎత్తున వసూళ్లు వస్తున్న నేపథ్యంలో నేటి నుండి కర్ఫ్యూ ను అమలు చేయడం తో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. ముందు ముందు పెద్ద సినిమాలు ఏమీ లేవు.. కనుక బంగార్రాజును జనాలు ఆధరిస్తారనే టాక్ ఉంది కాని 50 శాతం ఆక్యుపెన్సీతో అది కూడా నైట్ కర్ఫ్యూ ఉన్న సమయంలో సినిమా నడవడం అంటే చాలా పెద్ద విషయం. తెలంగాణలో పరిస్థితులు సాదారణంగానే ఉన్నాయి. కనుక మంగళ వారం కూడా బంగార్రాజు మంచి వసూళ్లను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగార్రాజు సినిమా ఇక మీదట సాధించే వసూళ్లే అత్యంత కీలకంగా మారాయి.
బ్రేక్ ఈవెన్ ను బంగార్రాజు సాధిస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. కాని సంక్రాంతికి అంత భారీగా విడుదల అయ్యి.. పెద్ద సినిమాలు పోటీ లేకపోవడం వల్ల ఖచ్చితంగా వంద కోట్ల వరకు వసూలు సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని అనూహ్యంగా బంగార్రాజు సినిమాకు ట్రేడ్ వర్గాల వారు ఊహించిన స్థాయిలో మాత్రం వసూళ్లు నమోదు అవ్వలేదు. అయితే యూనిట్ సభ్యులు ఈ సినిమా వసూళ్ల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన కు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా లో చైతూకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు కూడా సీక్వెల్ ను చేస్తామంటూ నాగార్జున ప్రకటించాడు. అయితే అది ఇప్పట్లో ఉండదని మాత్రం ప్రకటించాడు. ఆ సీక్వెల్ లో నాగార్జున మరియు నాగ చైతన్యతో పాటు అఖిల్ అక్కినేని కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.