Begin typing your search above and press return to search.
'బంగార్రాజు' అక్కినేని హీరోలను 100 కోట్ల క్లబ్ లో చేర్చేనా..?
By: Tupaki Desk | 6 Jan 2022 7:30 AM GMTకింగ్ అక్కినేని నాగార్జున 'మనం' 'సోగ్గాడే చిన్నినాయనా' 'ఊపిరి' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత.. మళ్ళీ ఆ స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. ఇప్పుడు తనయుడు యువసామ్రాట్ నాగచైతన్యతో కలిసి నటించిన ''బంగార్రాజు'' సినిమాపైనే సీనియర్ హీరో ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ చైతూ 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' వంటి హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఫార్మ్ లో ఉన్నారు. తండ్రీకొడుకులు కలిసి నటించిన మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాకు 40 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ''బంగార్రాజు'' సినిమా రూపొందింది. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించారు. షూటింగ్ ప్రారంభం అప్పుడే సంక్రాంతి పండుగను టార్గెట్ పెట్టుకుని సినిమాని పూర్తి చేసారు. అయితే ఫెస్టివల్ రేసులో 'ఆర్ ఆర్ ఆర్' 'రాధే శ్యామ్' 'భీమ్లా నాయక్' వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉన్నప్పుడు బంగార్రాజును విడుదల చేయాలని అనుకోవడం సరైన నిర్ణయం కాదని అందరూ భావించారు.
కానీ కరోనా - ఒమిక్రాన్ రూపంలో అదృష్టం కలిసి రావడంతో మిగతా మూడు సినిమాలు వాయిదా పడి, 'బంగార్రాజు' ఒక్కడే బరిలో నిలిచాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి అర డజనుకు పైగా సినిమాలు వస్తున్నప్పటికీ.. నాగ్-చైతూ సినిమా ఒక్కటే బజ్ క్రియేట్ చేయగలిగింది. పండగ రోజుల్లో వచ్చే పెద్ద సినిమా ఇదే కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'బంగార్రాజు' చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా సంక్రాంతి కాబట్టి హౌస్ ఫుల్స్ అవడం గ్యారంటీ. ఒకవేళ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం తండ్రీకొడుకులు కలిసి 100 కోట్ల భారీ గ్రాస్ ను వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే అక్కినేని హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సీక్వెల్ సినిమా నిలుస్తుంది. ఈ లెక్కలన్నీ అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నా.. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం వారిని కలవరపరిచే అంశం.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నా ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి షరతులు విధించలేదు. సంక్రాంతి వరకు ఇలానే ఉంటే 'బంగార్రాజు' కు ఇబ్బందేమీ లేదు. ఒకవేళ కేసుల తీవ్రత ఇంకా ఎక్కువై థియేటర్ల మీద ఆంక్షలు విధిస్తే మాత్రం వసూళ్ల మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కోసం థియేటర్లకు రావడానికి వెనుకాడే పరిస్థితి రావొచ్చు. మరి రాబోయే వారం రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'బంగార్రాజు' చిత్రంలో నాగార్జున - నాగచైతన్య ఇద్దరూ బంగార్రాజులుగానే కనిపించనున్నారు. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతూ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఫరియా అబ్దులా - వేదిక స్పెషల్ సాంగ్స్ లో కనిపించనున్నారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.