Begin typing your search above and press return to search.
'బంగార్రాజు' టీమ్‌లో ఆ జోరు కనిపించదే?
By: Tupaki Desk | 23 Dec 2021 11:30 PM GMTసంక్రాంతి రేస్ మరి కొన్నిరోజుల్లో స్టార్ట్ కాబోతోంది. అయినా `బంగార్రాజు` టీమ్‌లో మాత్రం జోరు కనిపించడం లేదు. ఇదే ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి బరిలో అడ్డంగా నిలబడతానంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ వచ్చిన `భీమ్లా నాయక్` సడన్‌గా పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తప్పుకున్నాడు అనడం కంటే `RRR` కోసం తప్పించడం అన్నది కరెక్టేమో. ఇదిలా వుంటే సంక్రాంతి పోటీ నుంచి `భీమ్లా నాయక్` తన్నుకోవడంతో కింగ్ నాగార్జున `బంగార్రాజు` రిలీజ్ కు లైన్ క్లియర్ అయిందనుకున్నారంతా.
ఈ వార్త విని అక్కినేని అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. జనవరి 15న రిలీజ్ అంటూ జోరుగా ప్రచారం మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఖచ్చితంగా సంక్రాంతి బరిలో వుండాల్సిందేనని నాగ్ ఫిక్సయినట్టు లీకులు కూడా ఇచ్చారు. ఇంత జరుగుతున్నా `బంగార్రాజు` టీమ్ లో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. పండగ సీజన్ దగ్గరపడుతున్నా మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి డేట్ అనౌన్స్ మెంట్ రావడం లేదు.
ఓ పక్క సంక్రాంతి రేసులో నిలిచిన `RRR` వరుస ప్రమోషన్ లతో హుషారెత్తిస్తూ బాలీవుడ్ మీడియాని ఆడేసుకుంటుంటే మరో పక్క జనవరి 14న రాబోతున్న `రాధేశ్యామ్` గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రచార పర్వానికి తెరలేపారు. ఆర్ ఎఫ్‌సీలో `రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ వేడుక ఈ గురువారం సాయంత్రం ఏర్పాడు చేసిన విషయం తెలిసిందే.
ఈ రెండు చిత్రాలకే మేజర్ థియేటర్లు బ్లాక్ అయిపోయాయి. మిగిలిన వాటితో సర్దేసుకోవాలంటే అది కలెక్షన్ లపై ప్రభావాన్ని చూపే అవకాశం వుంది. ముందే తన బయ్యర్లకు నాగ్ `మనం సంక్రాంతికే వస్తున్నాం` అని చెప్పినా... ఆషామాషీగా `బంగార్రాజు`కు థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ లభించినా ప్రస్తుతం వున్న సమయం `బంగార్రాజు`కు సరిపోదు.. అలాగని హడావిడిగా రిలీజ్ చేస్తే నాగ్ కు నష్టమే కానీ లాభం కలిగే పరిస్థితి లేదు.
`సోగ్గాడే చిన్నినాయన` చిత్రం 2016లో విడుదలై నాగ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టింది. దీంతో ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా వున్న నాగ్ దీనికి సీక్వెల్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేసి చివరికి ఈ ఏడాది మొదలుపెట్టారు. అయితే సెంటిమెంట్ గా భావించిన `బంగార్రాజు`ని హడావిడిగా విడుదల చేసి అయిపోయింది అనిపించుకోవడం నాగ్ కు ఇష్టం లేదు. చాలా కేర్ తీసుకుని ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసి తనకున్న సెంటిమెంట్ ప్రకారం మరో సారి భారీ విజయాన్ని దక్కించుకోవాలని నాగ్ భావిస్తున్నారు.
కానీ ప్రస్తుతం RRR, రాధేశ్యామ్ మధ్య నలిగిపోవడం ఇష్టం లేకే నాగార్జున సైలెంట్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాగార్జున రిలీజ్ డేట్ ని ప్రకటించలేకపోతున్నారని, ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకుని సినిమాని పక్కాగా సిద్ధం చేసుకున్న తరువాతే రిలీజ్ డేట్ ని ప్రకటించాలని బయ్యర్లు అంటున్నారట.