Begin typing your search above and press return to search.
వాసి వాడి తస్సాదియ్యా.. 'బంగార్రాజు' ట్రైలర్ అదిరిందయ్యా..!
By: Tupaki Desk | 11 Jan 2022 3:45 PM GMTకింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ''బంగార్రాజు''. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ట్యాగ్ లైన్. ఇది బ్లాక్ బస్టర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతూకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే విడుదలైన ''బంగార్రాజు'' సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ - సాంగ్స్ - టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
'చూపులతోనే ఊచకోత కోసేస్తాడు' అంటూ అమ్మాయిలతో సరసాలు ఆడే బంగార్రాజు పాత్రని పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభమైంది. కనిపించిన ప్రతీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ.. బంగార్రాజు బుద్దులతో ఊడి పడిన మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య కనిపిస్తున్నారు. తనకన్నా తెలివైన చదువుకున్న అమ్మాయి లేరని భావించే నాగలక్షిగా కృతిసెట్టి అలరించింది.
అయితే తనకన్నా తింగరిది తెలివి తక్కువ - మందబుద్ది దద్దమ్మ ఈ ఊర్లోనే లేదంటూ నాగలక్షిని టీజ్ చేస్తున్న చిన బంగార్రాజు.. చివరకు ఆమెతోనే ప్రేమలో పడ్డాడు. అలాంటి సమయంలో ఈసారి తన మనవడికి వచ్చిన సమస్య పరిష్కారం కోసం బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఇందులో రమ్యకృష్ణ కూడా ఆత్మగా కనిపించింది.
తన ఫ్యామిలీకి సమస్యను ఎదుర్కోడానికి చిన బంగార్రాజు వెనుక బంగార్రాజు ఒక శక్తిగా ఎలా ముందుకు నడిపాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. సోషల్ ఫాంటసీ అంశాలతో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ కు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
నాగ్ - చైతూ ఇద్దరూ ఎంతో హుషారుగా కనిపించారు. నాగార్జున ఎప్పటిలాగే పంచెకట్టులో ఆకట్టుకోగా.. నాగచైతన్య మోడ్రన్ దసరా బుల్లోడిగా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో స్టైలీష్ లుక్ లో ఆకర్షించారు. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
'బంగార్రాజు' చిత్రానికి సత్యానంద్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పని చేశారు. 'సోగ్గాడే..' కంటే ఇందులో గ్రాఫిక్ వర్క్ కీలకంగా కనిపిస్తోంది. 'వాసి వాడి తస్సాదియ్యా' అంటూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గోదావరి యాసలో రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇందులో నాగబాబు - చలపతి రావు - రావు రమేష్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మొత్తం మీద ఫన్ అండ్ యాక్షన్స్ ప్యాక్డ్ 'బంగార్రాజు' ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తోంది. 'మనం' తర్వాత అక్కినేని తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.