Begin typing your search above and press return to search.
'రాజమండ్రి' నిజసంఘటనల ఆధారంగా ఈ సినిమా చేసాం: అల్లరి నరేష్
By: Tupaki Desk | 21 Jan 2021 2:08 PM GMTటాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తన కొత్త సినిమా ‘బంగారు బుల్లోడు’ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. నరేష్ కొన్నేళ్ల నుండి సోలో హీరోగా ప్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. ఇండస్ట్రీలో డెబ్యూ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. తన కామెడీ టైమింగ్.. నటనతో మంచి పేరును సంపాదించుకున్నాడు. పాతతరం తర్వాత మంచి కామెడీ సినిమాలు చేస్తున్న ఈ జనరేషన్ హీరో అల్లరి నరేష్ మాత్రమే. హెల్తీ కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొంతకాలంగా హీరోగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. మధ్యలో మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలను వరుసగా లైన్ లో పెడుతున్నాడు.
అయితే తాజాగా విడుదలకు సిద్ధమైన 'బంగారుబుల్లోడు' సినిమా కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని షాకిచ్చాడు. నరేష్ మాట్లాడుతూ.. "రాజమండ్రిలో జరిగిన పలు రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఈ సినిమా తీసాము. ఒక బ్యాంక్ మేనేజర్ అసలు బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ వస్తువులను పెట్టి ప్రజలను మోసం చేశాడు. ఈ సంఘటనను మా సినిమాకు కథాంశంగా తీసుకున్నాము. దానికే కామెడీని జోడించడం జరిగింది. అయితే ఇందులో ఆర్టిఫిషల్ కామెడీ లేదు.. పూర్తిగా సిట్యుయేషన్స్ తో పాటు కామెడీ నడుస్తుంది. భారతీయులు బంగారం అనే పసుపు లోహాన్ని బాగా ప్రేమిస్తారు. అయితే చాలామంది ప్రజలు బ్యాంక్ లాకర్లలో భద్రంగా ఉంటుందని ఉంచుతారు. అయితే బంగారం బ్యాంకుల్లో, లాకర్లలో పెట్టడం ఎంత సురక్షితం అనేది చిత్రంలో చూపించే ప్రయత్నం చేసాం. బంగారం లావాదేవీలు చూసుకునే బ్యాంక్ మేనేజర్ పాత్రలో నేను నటించాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నరేష్, డైరెక్టర్ గిరిల పరిచయం ఇప్పటిది కాదట.
'అయితే డైరెక్టర్ గిరి నేను చేసిన బెండు అప్పారావు సినిమాకు స్క్రిప్ట్ రచయిత. అప్పటినుండి మేం టచ్ లోనే ఉన్నాం. కథాంశం ఫైనల్ చేసినప్పుడే నేను విలేజ్ నేపథ్యంలో కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్పాను. ఇక ఈ సినిమాకు 30-40 వరకు టైటిల్స్ అనుకున్నాం. ఒకరోజు డైరెక్టర్ బంగారు బుల్లోడు బాగుందని చెప్పేసరికి ఫైనల్ చేసాం. ఇక ఈ సినిమాలో 'స్వాతిలో ముత్యమంత' రీమిక్స్ సాంగ్ ఐడియా నిర్మాత అనిల్ సుంకరదే' అన్నాడు నరేష్. ఈ సినిమా జనవరి 23న విడుదల కాబోతుంది. చూడాలి మరి బ్యాంకు మేనేజర్ గా నరేష్ సక్సెస్ అవుతాడో లేదో!!