Begin typing your search above and press return to search.
తాగి, హీరోయిన్ ఎవరితోనే పడుకుంటే తప్పేంటి?
By: Tupaki Desk | 11 Aug 2021 10:30 AM GMTబంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్, విదేశీ మద్యం, అశ్లీల రాకెట్ కేసుల్లో అరెస్ట్ అయిన బంగ్లాదేశ్ నటి పోరీ మోనీకి సపోర్టు చేశారు. ఆమెకు సపోర్టుగా హాట్ కామెంట్స్ చేసి కొత్త దుమారాన్ని రేపారు.
తాజాగా తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. ‘పోరీ మోనీ పేరు చెప్పకుండా ఇండైరెక్టుగా మాట్లాడారు. ‘ఇంట్లో మద్యం ఉంచుకుంటే బంగ్లాదేశ్ అమ్మాయిలను అరెస్ట్ చేస్తారు’ అంటూ తస్లీమా ట్వీట్ చేశారు. ఇక ఆ తర్వాత ఫేస్ బుక్ లో పెద్ద ఉత్తరమే రాసుకొచ్చారు. పోరీమోనీపై ఏయే కేసులు పెట్టారో ఆ పోస్టులో తెలిపారు. ఆ కేసుల్లో వేటికి ఆధారాలు లేవు అని ఆమె అన్నారు.
పోరీ మోనిని కావాలనే కేసుల్లో ఇరికించారని రచయిత్రి తస్లీమా ఆరోపించారు. ‘మద్యం తాగడం, మద్యం ఇంట్లో ఉంచుకోవడం.. ఇంటిలో చిన్న బార్ ఏర్పాటు చేసుకోవడం నేరం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఎవరితో సినిమాకు వెళితే తప్పేంటి? ఎవరి సాయంతో మోడలింగ్ చేస్తే తప్పేంటి? నగ్నంగా ఫొటోలు దిగితే తప్పేంటి? తాగి పడుకుంటే తప్పేంటి?’ అంటూ పోరీ మోనీకి మద్దతుగా తస్లీమా మాట్లాడారు. మగాడికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పు కాదు కానీ.. మద్యం బాటిళ్లు ఇంట్లో తప్పు అయిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు.
ప్రశ్నిస్తుందనే పోరీ మోనీని అరెస్ట్ చేశారని.. అదే మగవాళ్లు అలా చేస్తే ఏమీ అనరని బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తస్లీమా మండిపడ్డారు. ఈ కేసులో నిజమైన నేరాలు బయటకు రావాలన్నారు.
బంగ్లాదేశ్ అగ్రకథానాయిక పోరీ మోనీ (28) అరెస్ట్ బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించింది. పెద్దఎత్తున డ్రగ్స్ కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’ ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఇదే హీరోయిన్ పోరీ మోనీ ప్రముఖ బంగ్లాదేశ్ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసింది. అది జరిగిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో ఇందులో కుట్ర ఉందని.. న్యాయం చేయాలని ఆమె అభిమానులు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు.
పోరీ మోనీ చిన్న వేశాలు వేస్తూ స్టార్ హీరోయిన్ గా బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త , రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహ్మద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది.బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.
ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేసింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని మంత్రులతో స్నేహం ఉండడంతో కేసు నమోదు కాకుండా నజీర్ తప్పించుకున్నాడన్న ప్రచారం మొదలైంది. ఈ తరుణంలో నటికి సోషల్ మీడియాలో, ప్రజల్లో మద్దతు వెల్లువెత్తింది. ఇక తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో నజీర్ ను, ముగ్గురు మహిళలను, డ్రగ్ డీలర్ తుహిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నజీర్ అరెస్ట్ అయిన వారానికే గుల్షన్ అల్ కమ్యూనిటీ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా కేసులు దాఖలు చేశారు. నజీర్ కు చెందిన క్లబ్ యే ఇదీ.. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు కాగా.. తాజాగా అరెస్ట్ చేశారు. తాజాగా పోరీ మోనీ ఫేస్ బుక్ లో ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇంటి గేట్ ను ధ్వంసం చేశారని.. చంపాలని చూస్తున్నారని.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందింది. కాసేపటికే ఆమెను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో ఇదంతా వ్యాపారవేత్త నజీర్ కుట్ర అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే రచయిత్రి తస్లీమా కూడా తాజాగా పోరీమోనీకి మద్దతుగా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది.