Begin typing your search above and press return to search.

#కోవిడ్ 19.. యూకే నుంచి దిగిన కుర్ర హీరోయిన్.. చేర్చుకోనన్న ప్ర‌భుత్వాస్ప‌త్రి!

By:  Tupaki Desk   |   6 Jan 2021 5:52 AM GMT
#కోవిడ్ 19.. యూకే నుంచి దిగిన కుర్ర హీరోయిన్.. చేర్చుకోనన్న ప్ర‌భుత్వాస్ప‌త్రి!
X
అర్జున్ రెడ్డి రీమేక్ `ఆదిత్య వ‌ర్మ`లో ధృవ్ విక్ర‌మ్ స‌ర‌స‌న‌ న‌టించి త‌మిళ సినీప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించింది ఎన్నారై బ్యూటీ బానిటా సంధు. బాలీవుడ్ లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన `అక్టోబ‌ర్` మూవీలోనూ ఈ భామ క‌థానాయిక‌. ఈ రెండు సినిమాల్లో బానిట న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. బానిట‌కు క‌రోనా పాజిటివ్ అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కోల్ క‌త‌లో ఓ షూటింగ్ ఒత్తిడిలో ఉన్న బానిట‌కు కోవిడ్ సోకింద‌ని నిర్ధారించిన వెంటనే స‌మీపంలోని ఓ ప్ర‌భుత్వాస్ప‌త్రిలో చేరేందుకు ప్ర‌య‌త్నిస్తే అక్క‌డ నిరాక‌రించార‌ని తెలిసింది. దీంతో త‌న‌ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వ సదుపాయంలో చికిత్స చేయడానికి నిరాకరించడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపడం విస్మ‌యం క‌లిగిస్తోంది.

బానిట ప్ర‌స్తుతం కవిత అండ్ తెరెసా చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. డిసెంబర్ 20 న యూకే(బ్రిట‌న్ ) నుండి బానిట‌ కోల్ కతా వ‌చ్చారు. ఆ క్ర‌మంలోనే త‌న‌కు స్ట్రెయిన్ వైర‌స్ సోకింద‌న్న అనుమానాలున్నాయి. అప్ప‌టికే ప‌రివ‌ర్త‌న కోవిడ్ జాతికి పాజిటివ్ అని తేలిన‌ యువకులతో ఆమె అదే విమానంలో ప్రయాణించిందని తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అవ్వ‌గా... ఆమె కొత్త జాతి బారిన పడినదా అని నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని ఓ అధికారి తెలిపారు.

యుకె నుండి తిరిగి వచ్చిన వారిని ఉంచడానికి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసిన బెలియఘాటా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చార‌ని.. అయితే బనితా సంధు అంబులెన్స్ నుండి బయటకు రావడానికి నిరాకరించారని కూడా తెలుస్తోంది.