Begin typing your search above and press return to search.

టాప్ 5లోకి వచ్చేసిన భరత్

By:  Tupaki Desk   |   24 April 2018 6:24 AM GMT
టాప్ 5లోకి వచ్చేసిన భరత్
X
రెండేళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూసిన మహేష్ బాబు ఆశలు పూర్తిగా నిలబెట్టేసింది భరత్ అనే నేను. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అది మహేష్ మొహంలో స్పష్టంగా కనిపించేసింది. తనకు బలమైన పట్టున్న ఓవర్సీస్ లో ఎప్పటిలాగే భరత్ అనే నేను మరోసారి ప్రభంజనం సృష్టించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ వసూళ్ళ సునామి రేపుతున్నాడు. వీక్ ఎండ్ ముగిసాక కూడా స్ట్రాంగ్ గా ఉన్న భరత్ అనే నేను సోమవారం దాకా 2.5 మిలియన్ మార్క్ చేరుకొని మూడు మిలియన్ల మార్క్ కు పరుగులు పెడుతోంది. ఇంకా మొదటి వారం కూడా పూర్తి కాలేదు కనక అదేమి పెద్ద కష్టం కాదు. ఇప్పటి దాకా వచ్చిన వాటిలో టాప్ 5లో ప్లేస్ తీసేసుకుంది భరత్ అనే నేను. ఇంకా ఫుల్ రన్ చాలా ఉంది కాబట్టి ఫైనల్ గా ఏ ప్లేస్ లో నిలుస్తుంది అనేది వేచి చూడాలి

టాప్ 5 (ఓవర్సీస్)

1. బాహుబలి 2 ది కంక్లూజన్ –$ 2,01,17,274

2. బాహుబలి ది బిగినింగ్ –$ 6,997,636

3. రంగస్థలం –$ 3,430,342

4. శ్రీమంతుడు –$ 2,891,742

5. భరత్ అనే నేను -$ 2,518,050

పైన లెక్కల్లో రంగస్థలం, భరత్ అనే నేను తప్ప మిగిలినవన్నీ ఫుల్ రన్ పూర్తి చేసుకున్నవి.రంగస్థలం మరో పది రోజుల దాకా జోరు కొనసాగించవచ్చు కాని భరత్ అనే నేను ఇంకా ఫస్ట్ వీక్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. సో ఈ రెండు సినిమాల ఫిగర్స్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మొత్తానికి భరత్ అనే నేను గ్రాండ్ సక్సెస్ తో మహేష్ లోనే కాదు ఫాన్స్ లో కూడా ఆనందం ఆకాశాన్ని తాకుతోంది.