Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ముగ్గురూ మూడు రుచులు

By:  Tupaki Desk   |   20 July 2017 8:15 AM GMT
ట్రైలర్ టాక్: ముగ్గురూ మూడు రుచులు
X
కొత్త కథతో ఇంప్రెస్ చేసిన.. ‘నీల్ బట్టే సన్నాట’ సినిమా డైరెక్టర్ అశ్విని ఐయర్ తీవారి ఇప్పుడు మరో చిన్న కథతో కొత్త హంగులుతో వస్తున్నాడు ‘బరేలి కి బర్ఫీ’ సినిమాతో. ఉత్తర్ ప్రదేశ్ చెందిన ఒక చిన్న టౌన్ బరేలి అమ్మాయిగా కృతి సనోన్ ఆ అమ్మాయిని ప్రేమించే పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటించగా. రాజ్ కుమార్ రావు ఒక రచయత గా చీరలు అమ్మే ఒక సేల్స్ మాన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ నిన్నే విడుదల చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.

ట్రైలర్ మొదలుకావడంతోనే ఒక మధ్యతరగతి ఉత్తర ప్రదేశ్ కుటంబ స్త్రీ లో ఉండే తియ్యదనం అమాయకత్వంతో పరిచయం చేశారు. హీరోయిన్ వాళ్ళ కు ఒక స్వీట్ షాప్ ఉంటుంది. హీరోయిన్ నవలలు చదువుతూ ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ ఉంటుంది. తన ఆశలును అర్ధం చేసుకొనే ఒక రచయత(రాజ్ కుమార్ రావు)ను ప్రేమిస్తుంది. ఆ రచయత కోసం ఆ పుస్తకులు ప్రింట్ చేసే మరో హీరో(ఆయుష్మాన్ ఖురానా)ని కలుసుకొని తనకి సహాయం చేయమని అడుగుతుంది. ఆయుష్మాన్ హీరోయిన్ కృతిని చూసిన మారు క్షణమే ప్రేమలో పడతాడు. ఎలాగైనా రాజ్ కుమార్ రావును కృతి దగ్గర చెడ్డ చేసి తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రాజ్ కుమార్ రావు లో ఉండే రెమో మామ లాంటి పాత్ర ఇంకోటి బయటకు వచ్చి కథను మలుపు తిప్పుతుంది. కృతి ఇలా తన ప్రేమను వెతుకుతుంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న తన కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కామిడీ తో పాటుగా హీరోల మరియు హీరోయిన్ పాత్రలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి.

కృతి ఇంత వరకు ఇలాంటి పాత్రలు చేయలేదు అనే చెప్పాలి. ఇక పోతే రాజ్ కుమార్ రావు తన నటనతో అందరిని ఒకసారిగా షాక్కి గురిచేశాడు. కొంచం తేడాగా రౌడీగా బాగానే మార్పు చూపించి మెప్పించాడు. అలానే ఆయుష్మాన్ ఖుర్రాన తన సహజ నటనకు బిన్నంగా ప్రయత్నం చేశాడు. మొత్తానికి దేశి స్టైల్ లో ఉందీ ట్రైలర్. నార్త్ ఇండియా లో ఒక చిన్న టౌన్ లో జరిగే ఈ ప్రేమ కథ ఆగష్టు 18 నాడు విడుదలకాబోతుంది. ఈ ముగ్గురూ అందించే మూడు రుచులు ఎలా ఉంటాయో ఆ రోజు తెలిసిపోతుంది.