Begin typing your search above and press return to search.

మహేష్ ఇవి మేనేజ్ చేస్తే చాలు

By:  Tupaki Desk   |   7 May 2019 6:05 AM GMT
మహేష్ ఇవి మేనేజ్ చేస్తే చాలు
X
జస్ట్ ఇంకో 40 గంటలు గడిస్తే చాలు మహర్షి మొదటి ప్రీమియర్ షో పడిపోతుంది. ఎక్కడ ఫస్ట్ వేస్తున్నారనే క్లారిటీ ఇంకా రాలేదు కాని ఎపిలో బెనిఫిట్ ఆటలు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. బాగుందనే టాక్ వస్తే చాలు మహేష్ చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కడు నుంచి భరత్ అనే నేను దాకా ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యిందే. అయితే పోటీ లేనప్పటికీ మహేష్ ని కొన్ని స్పీడ్ బ్రేకర్లు పలకరిస్తున్నాయి. వాటిని మాత్రం కొంత మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొదటిది విపరీతమైన ఎండలు. ఈ సమ్మర్ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు గత మూడు నాలుగు రోజులుగా నమోదవుతున్నాయి. శనివారం దాకా ఇదే పరిస్థితని వాతావరణ శాఖ చెబుతోంది. మొదటిరోజు అభిమానులతో షోలు నిండిపోయినా మరుసటి రోజు ఉదయం మధ్యాన్నం ఆటలకు సూర్యుడు ప్రతిబంధకంగా నిలుస్తాడు. సో ఇది ఒకరకంగా ఆ మూడు రోజులు సవాల్ లాంటిదే

ఇంకోటి ఐపిఎల్ ఫీవర్. అనూహ్యంగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్ళడంతో పదిన జరిగే ఫైనల్ దాకా క్రికెట్ ప్రేమికులు సాయంత్రం పూట టీవీలకు అతుక్కుపోతారు. ఒకవేళ ఎస్ఆర్ హెచ్ ఫైనల్ కు వెళ్ళినా వెళ్లకపోయినా రసపట్టులో జరిగే మ్యాచులు కాబట్టి రేటింగ్స్ చాలా అధికంగా ఉంటాయి. వీళ్ళను మహర్షి వైపు లాగడం అంత ఈజీ కాదు.

మొదటి నాలుగు రోజుల వీకెండ్ వసూళ్లు చాలా ముఖ్యం కాబట్టి ఈ అంశం ప్రభావితం చూపదని అనుకోవడానికి లేదు. ఇవి పక్కనపెడితే పరీక్షలన్నీ పూర్తైపోవడం మహర్షికి కలిసి వస్తున్న సూపర్ పాజిటివ్ యాంగిల్. ఎంసెట్ నీట్ గ్రూప్స్ తో సహా కీలకమైన ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి. సో ఆ పరంగా ఇబ్బంది లేదు. గురువారం ఉదయం వచ్చే మొదటి ఆట టాక్ ని బట్టి మహేష్ ఏ రేంజ్ లో వసూళ్ళ సునామి రేపబోతున్నాడో క్లారిటీ వచ్చేస్తుంది