Begin typing your search above and press return to search.
మహానటితో బయోపిక్స్‌కు కష్టకాలమే
By: Tupaki Desk | 10 May 2018 10:24 AM GMTసావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా మహానటి. సూపర్ హిట్ కొట్టిన చిత్రం. బయోపిక్ ఇలా ఉండాలి అన్నట్టుగా ప్రశంసలు పొందిన సినిమా. ఇంకా సినీ జనాలు మహానటి చూశాక ఆ మాయ నుంచి బయటికి రాలేకపోతున్నారు. సావిత్రిని కీర్తిసురేష్‌ను మర్చిపోలేక పోతున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మహానటి ఈ స్థాయిలో ఉండడం వల్ల తరువాత వచ్చే బయోపిక్స్‌కు కాస్త కష్టకాలమే అని చెప్పాలి.
టాలీవుడ్‌లో బయోపిక్స్ కాలం నడుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ జీవితకథను అతని కొడుకు బాలయ్యే తెరకెక్కిస్తున్నాడు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర పేరుతో తీస్తున్నారు. అలాగే చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహారెడ్డి కూడా ఉయ్యాలవాడ జీవితకథే. అలాగే త్వరలో పీవీ సింధు పుల్లెల గోపీచంద్ బయోపిక్స్ కూడా వస్తాయని ప్రకటించారు. ఇవన్నీ విడుదలయ్యే లోపు మహానటిని ప్రజలు మరిచిపోతే ఫర్వాలేదు. లేకుంటే ఏమాత్రం బాగోకపోయినా మహానటితో పోలికలు తప్పవు. పైన చెప్పిన సినిమా డైరెక్టర్లు కూడా ఇప్పటికే మహానటిని చూసి కాస్త ఆందోళన పడే ఉంటారు. తాము ఆ స్థాయిలో తీస్తేనే ప్రేక్షకుడి అంచనాలను అందుకోగలమని భావించే ఉంటారు.
ఏదోలా తీసేస్తే కుదరదు... కళ్లను మనసును కట్టిపడేసేలా ఉండాలి బయోపిక్. ఇంటికి వచ్చాక కూడా ఆ గురుతులు గుర్తుకొస్తూనే ఉండాలి. ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉండాలి. సావిత్రి రూపంలో కీర్తిసురేష్ ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులను వెంటాడుతోంది. మహానటిలో ఒక్కో పాత్ర ఒక్క అందమైన సృష్టి. నేటి తరానికి కూడా నచ్చేట్టు ఆనాటి హీరోయిన్ కథను హృద్యంగా తెరకెక్కించాడు నాగ అశ్విన్.