Begin typing your search above and press return to search.
టైగర్‌కు దెబ్బ పడినట్లుందే..
By: Tupaki Desk | 3 July 2015 9:30 AM GMTసందేహం లేదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఆడుతున్న సినిమాల్లో బెస్ట్.. టైగర్. దానికి వారం వచ్చిన సినిమాలన్నీ తేలిపోయాయి. ఈ శుక్రవారం వస్తున్న వాటిలో ఏదీ దీనికి పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఫస్ట్ వీక్‌లో 'టైగర్'కు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. కానీ ఈ శుక్రవారం చిన్నాచితకా కలిపి దాదాపు పది సినిమాల దాకా విడుదల కావడంతో 'టైగర్'ను కొన్ని చోట్ల లేపేయక తప్పలేదు. ముఖ్యంగా జయసుధ కొడుకు శ్రేయన్ సినిమా 'బస్తీ' కోసం బాగా ఆడుతున్న 'టైగర్'ను థియేటర్ల నుంచి ఖాళీ చేసేశారు.
వారం నుంచి 'బస్తీ' సినిమాకు భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు. థియేటర్ల విషయంలో జయసుధ లాబీయింగ్ గట్టిగానే చేసినట్లున్నారు. ఈ వారం వస్తున్న చిన్న సినిమాలన్నింటికీ కలిపి ఎన్ని థియేటర్లిచ్చారో.. 'బస్తీకి' దాదాపుగా అన్ని థియేటర్లు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్‌లో బస్తీ సినిమాకు దాదాపు 30 థియేటర్లిచ్చారు. టైగర్ సినిమాను పది థియేటర్లకు పరిమితం చేశారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. మూడు వారాల కిందట విడుదలైన దిల్ రాజు సినిమా 'కేరింత' మాత్రం ఇప్పటికీ హైదరాబాద్‌లో 20కి థియేలర్లలో ఆడుతోంది. సినిమా కలెక్షన్లు బాగా డ్రాప్ అయినప్పటికీ దిల్ రాజు మాత్రం అస్సలు తగ్గట్లేదు. తన సినిమాను థియేటర్ల నుంచి తప్పించడానికి ఆయనొప్పుకోవడం లేదు. ఐతే అందరూ కలిసి మంచి టాక్‌తో నడుస్తున్న 'టైగర్'ను దెబ్బతీస్తుండటమే విడ్డూరమైన విషయం.