Begin typing your search above and press return to search.

ఏంటి మహేష్ కి పోటీ వస్తోందా..

By:  Tupaki Desk   |   29 April 2018 1:30 AM GMT
ఏంటి మహేష్ కి పోటీ వస్తోందా..
X
స్టార్ హీరోగా మహేష్ బాబుకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. పాజిటివ్ టాక్ వస్తే కనుక.. తన సినిమాతో ఏ రేంజ్ లో ప్రభంజనాలు సృష్టించగలడో చెప్పేందుకు.. భరత్ అనే నేను మూవీనే సాక్ష్యం. అయితే.. మహేష్ బాబు బ్రాండ్ అండార్స్ మెంట్స్ విషయంలో మహా దూకుడుగా ఉంటాడు. నిజానికి సినిమాల కంటే ఎక్కువగా ఈ ప్రచారాలతోనే మహేష్ సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది.

మహేష్ బాబు మూవీ 1నేనొక్కడినే చిత్రంతో పరిచయమైన కృతి సనోన్ కూడా ఇదే రూట్ ని ఫాలో అవుతున్నట్లుగా ఉంది. బాలీవుడ్ లో ఈ అమ్మడి ఫిలిం కెరీర్ బాగానే ఉంది కానీ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న తీరుగా.. బడా బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తెగ సంతకాలు చేసేస్తోంది. దేశంలోనే ప్రఖ్యాత షూ మార్ట్ అయిన బాటా సంస్థతో కూడా ఇప్పుడీమె ఒప్పందం చేసుకుంది. 21 సంవత్సరాల తర్వాత ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఇలా బాటా కంపెనీ ప్రచారానికి ఎంచుకుంది. రెండు దశాబ్దాల క్రితం రాణి ముఖర్జీ తర్వాత మళ్లీ ఇప్పుడు కృతికే ఆ అవకాశం దక్కింది.

బాటా కాకుండా కృతి సనోన్ చేతిలో చాలానే బ్రాండ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ కు ఇండియాలో ప్రచారకర్త ఈమే. అంతే కాదు.. ట్రైడెంట్ గ్రూప్ నకు చెందిన బాత్ అండ్ హోమ్ లైనెన్ కు.. టైటాన్ సంస్థ రాగా కలెక్షన్ కు.. పారాచూట్ హెయిర్ ప్రొడక్ట్స్ కు.. అప్పెరల్స్ సంస్థ అమెరికన్ స్వాన్.. టిస్సాట్ కు చెందిన క్విక్ స్టర్ ఫుట్ బాల్ వాచ్ కు కూడా కృతి సనోన్ ప్రచారం చేసేస్తోంది.