Begin typing your search above and press return to search.
సీఎం క్యాంప్ ఆఫీసు పేరు మార్చేస్తున్నారు!
By: Tupaki Desk | 5 Oct 2016 12:37 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా అంగరంగ వైభవంగా - అద్భుతంగా ఉంచే దిశగా చేసే సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించాలని సిద్ధమైన కేసీఆర్ ఈ మేరకు సుమారు 15 కోట్ల రూపాయల నిధులు కేటాయించి తన కూతురు - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో ప్రపంచవ్యాప్తంగా పూల పండుగను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి వరకు ఇబ్బందేమీ లేకున్నా.... ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బంగారు బతుకమ్మ వేడుకలతో పేరుతో చేపడుతున్న కార్యక్రమాల పైనే ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో అభ్యంతరాలు తెలుపుతున్నాయి.
ఆరో రోజు బతుకమ్మ సంబరాల్లో భాగంగా సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం కేసీఆర్ సతీమణి శోభ - కేటీఆర్ సతీమణి శైలిమ - ఎంపీ కవిత - మంత్రుల సతీమణులతో పాటు పలువురు మహిళలు బతుకమ్మ పేర్చి పాటలు పాడారు. బతుకమ్మ పాటలతో క్యాంపు ఆఫీస్ మార్మోగిపోతోంది. బతుకమ్మ వేడుకలతో క్యాంపు ఆఫీస్ కొత్త శోభను సంతరించుకుంది. ఈ పరిణామంపై కొన్ని పార్టీలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు తెరతీశాయి. తెలంగాణ సంస్కృతిని చాటాలి అనుకుంటే క్యాంప్ ఆఫీసుకు ఆయా పార్టీలు, వివిధ రంగాలకు చెందిన మహిళా నాయకురాల్లను కూడా భాగస్వామ్యం చేసి బతుకమ్మ పండుగ నిర్వహిస్తే బాగుండేదని అంటున్నారు. క్యాంప్ ఆఫీస్ ను టీఆర్ ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల గుసగుసలపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/