Begin typing your search above and press return to search.

టీవీషోలో గీత కామెంట్స్ పై ఆగ్రహం

By:  Tupaki Desk   |   7 Nov 2016 3:30 PM GMT
టీవీషోలో గీత కామెంట్స్ పై ఆగ్రహం
X
ఇంట్లో గొడవులను కెమేరాల ముందు పెట్టి టీవీ షోలలో ప్రదర్శించే టైపు కార్యక్రమాలు మన ఛానళ్లలో చాలానే వచ్చేస్తున్నాయి. ఒకప్పడు హీరోయిన్లుగా ఉన్న ఇప్పటి నటీమణులు వీటిని హోస్ట్ చేస్తూ.. దాదాపు ప్రైవేటు సెటిల్మెంట్స్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా జీవిత.. ఆమె పీఏ పై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కాగా.. ఇప్పుడు బతుకు జట్కా బండి నిర్వహిస్తున్న గీత కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు.

గత నెల 31న ప్రసారమైన ఎపిసోడ్ లో స్వలింగ సంపర్కులైన ఓ ఇద్దరు అమ్మాయిలు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇందులో అమ్మాయి అమ్మాయి కలిసి ఉండడంపై గీత చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. అసలు అమ్మాయిలు ఎలా కలిసి ఉంటారు.. అలా ఉండొచ్చా.. ఇలా చేస్తే కాళ్లు విరగ్గొడతా అంటూ గీత వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పుడు ఎల్జీబీటీక్యూ(లెస్బియన్ గే బైసెక్సువల్ ట్రాన్స్ జెండర్ ఖీర్) ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమది భిన్నమైన సమూహం అని.. అసలు తమ గురించి ఏమీ తెలియకుండా.. తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరిగాదని.. వెంటనే గీతతో పాటు.. ఈకార్యక్రమం నిర్వాహకులు.. ఛానల్ యాజమాన్యం వివరణ ఇవ్వాలని ఎల్జీబీటీ డిమాండ్ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/