Begin typing your search above and press return to search.

కోర్టును ఆశ్రయిస్తున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' బయ్యర్లు

By:  Tupaki Desk   |   3 April 2019 8:06 AM GMT
కోర్టును ఆశ్రయిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ బయ్యర్లు
X
వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై వచ్చిన క్రేజ్‌ నేపథ్యంలో ఈ చిత్రంను అన్ని ఏరియాల్లో కూడా బయ్యర్లు పెద్ద మొత్తంతో కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీలోని అన్ని ఏరియాల్లో కూడా పోటీ పడి మరీ బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ సినిమాలు విడుదల కరెక్ట్‌ కాదు అంటూ ఏపీ హైకోర్టు విడుదలకు స్టే విధించిన విషయం తెల్సిందే.

ఏపీలో విడుదల కాని సినిమా తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో విడుదల అయ్యింది. ఏపీలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఏపీలో విడుదల కాకున్నా కూడా అక్కడ ప్రేక్షకులు పైరసీ లేదా ఇతరత్ర మార్గాల ద్వారా చూస్తున్నారు. దాంతో ఏపీలో సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు గగ్గొలు పెడుతున్నారు. సినిమాను ఇప్పటికైనా విడుదల చేయకపోతే మేము పెట్టిన పెట్టుబడి పూర్తిగా లాస్‌ అవ్వడం ఖాయం అని, ఇప్పటికైనా సినిమాను విడుదల కానివ్వాలంటూ బయ్యర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

రామ్‌ గోపాల్‌ వర్మ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. బయ్యర్లు సినిమా విడుదల స్టేను సవాల్‌ చేస్తే హై కోర్టుకు వెళ్లారు అంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే సినిమాపై స్టేను సవాల్‌ చేస్తూ నిర్మాత రాకేష్‌ రెడ్డి సుప్రీంకు వెళ్లాడు. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బయ్యర్ల నష్టంపై హైకోర్టు ఎలా రియాక్ట్‌ అవుతుందో అనే విషయంపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలైన తర్వాత, విడుదల కాకముందు వివాదానికి కేంద్ర బింధువుగా మారింది.