Begin typing your search above and press return to search.

పాపం.. రకుల్‌ కు అక్కడ ఇదే పరిస్థితి

By:  Tupaki Desk   |   24 April 2019 6:12 AM GMT
పాపం.. రకుల్‌ కు అక్కడ ఇదే పరిస్థితి
X
టాలీవుడ్‌ లో రెండేళ్ల క్రితం టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు వెళ్లిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఒకానొక సమయంలో మహేష్‌ బాబుతో నటించేందుకు కూడా ఈమె వద్ద డేట్లు లేకుండా అయ్యింది. అలా బిజీగా టాలీవుడ్‌ లోని దాదాపు టాప్‌ స్టార్స్‌ అందరితో నటించేసిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రెండేళ్లలో మొత్తం రివర్స్‌ అయ్యింది. లక్కీ ఛామ్‌ కాస్త వరుస ఫ్లాప్‌ ల కారణంగా ఐరెన్‌ లెగ్‌ అయ్యింది. ఆమెతో సినిమాలు చేసేందుకు స్టార్స్‌ ఎవరు ఆసక్తి చూపించక పోవడంతో పాటు, చిన్నా చితకా చేసినా కూడా ఆ సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయి.

ఈ సమయంలోనే రకుల్‌ తమిళంలో అటు బాలీవుడ్‌ లో ప్రయత్నాలు చేసింది. తమిళంలో చేసిన సినిమాలు నిరాశ పర్చగా, చేస్తున్న సినిమాలపై ఆశ పెట్టుకుని ఎదురు చూస్తోంది. ఇక ఇదే సమయంలో రకుల్‌ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ తో కలిసి 'దే దే ప్యార్‌ దే' చిత్రంలో నటించింది. 50 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడే పాతికేళ్ల యువతి పాత్రలో రకుల్‌ ఈ చిత్రంలో కనిపించబోతుంది. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలై అందరిని ఆకట్టుకుంది. రకుల్‌ గ్లామర్‌ మరియు సినిమాలో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మస్త్‌ గా ఉందని అంతా భావించారు. సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.

సినిమాపై అంతగా అంచనాలున్నా కూడా సినిమాను కొనుగోలు చేసేందుకు మాత్రం బయ్యర్లు ముందుకు రావడం లేదట. 'దే దే ప్యార్‌ దే' చిత్రం వచ్చే నెలలో విడుదల అవ్వాల్సి ఉంది. సౌత్‌ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఉన్న క్రేజ్‌, బాలీవుడ్‌ లో అజయ్‌ దేవగన్‌ కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ చిత్రం మంచి బిజినెస్‌ చేస్తుందని భావిస్తే అసలు సినిమాను నామమాత్రపు రేట్లకు కూడా కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్‌ నాధ్‌ కీలక పాత్రలో నటించాడు. రేప్‌ కేసు నింధితుడు అయిన అలోక్‌ నాధ్‌ ను సినిమా నుండి తొలగించాలని మొదటి నుండి చాలా మంది డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కాని అజయ్‌ దేవగన్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఆయన్ను తొలగించేందుకు నో చెప్పారు. ఆయనతో సినిమా పూర్తి చేశారు. ఇప్పుడు ఆ కారణం వల్ల బయ్యర్లు సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. అలోక్‌ నాధ్‌ ఉన్న ఈ సినిమాను విడుదల సమయంలో అడ్డుకుంటే పరిస్థితి ఏంటీ అని బయ్యర్లు బయపడి ముందుకు రావడం లేదని సమాచారం అందుతోంది. ఇలాంటి సమయంలో దే దే ప్యార్‌ దే పరిస్థితి ఏంటో చూడాలి. ఈ చిత్రంతో అయినా బాలీవుడ్‌ లో సక్సెస్‌ ను దక్కించుకుని అక్కడ సెటిల్‌ అవ్వాలని రకుల్‌ కు నిరాశే మిగిలేలా ఉంది.