Begin typing your search above and press return to search.

కామెడీ స్టార్స్ కు ఈసారి బిబి ఛాన్స్‌!

By:  Tupaki Desk   |   9 July 2021 2:30 AM GMT
కామెడీ స్టార్స్ కు ఈసారి బిబి ఛాన్స్‌!
X
తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 5 సందడి కొనసాగుతోంది. ఈ సీజన్ లో కనిపించబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయమై గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొదటి మూడు సీజన్ లతో పోల్చితే నాల్గవ సీజన్ లో పాల్గొన్న సోషల్ మీడియా సెలబ్రెటీలకు మరియు పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన వారికి కూడా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. సీజన్ 4 లో సోహెల్‌.. మెహబూబ్‌.. దివి ఇంకా పలువురు కూడా మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకుని ఇప్పుడు అన్ని విధాలుగా దూసుకు పోతున్నారు. అందుకే బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో ఛాన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క సెలబ్రెటీ కూడా మంచి పేరు దక్కించుకోవడంకు గుర్తింపు దక్కించుకోవడంకు బిగ్ బాస్ ఒక మార్గం గా భావిస్తున్నారు. అందుకే తమకు ఉన్న పరిచయాల ద్వారా బిగ్‌ బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

బుల్లి తెర వర్గాల ద్వార అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్‌ లోకి స్టార్‌ మా టీవీలో వచ్చే షో ల్లో కనిపించే వారు సీరియల్‌ ఆర్టిస్టులు కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్‌ మా లో టెలికాస్ట్‌ అయ్యే కామెడీ స్టార్స్ షో లో కనిపించే వారు కొందరు బిగ్‌ బాస్‌ హౌస్ లో సందడి చేయబోతున్నారు. ఆ జాబితాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సిరి హన్మంత్‌. పెళ్లి అయిన పొట్టి పిల్ల డాన్స్ లతో ఇరగదీస్తుంది. పొట్టి బట్టలు వేసుకోవడం మొదలు అన్ని విషయాల్లో కూడా ఫుల్‌ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్‌ చేస్తుందనే పేరు దక్కించుకుంది. అందుకే సిరి ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

గతంలో సీరియల్స్ లో నటించడంతో పాటు వెండి తెరపై కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది. సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఈ పిల్లకు బిగ్‌ బాస్ మేకర్స్ ఇప్పటికే హామీ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. స్టార్‌ మా లో ఎక్కువగా కనిపిస్తున్న ఈమె అప్పుడప్పుడు ఈటీవీ షోల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాని ఈమద్య కాలంలో బిగ్‌ బాస్ లో ఆఫర్‌ కోసం పూర్తిగా స్టార్‌ మా కే సమయం కేటాయిస్తుంది. పూర్తి స్థాయిలో కామెడీ స్టార్‌ లో కనిపిస్తున్న ఈమె ముక్కు అవినాష్ తో పాటు పలువురికి జోడీగా స్కిట్ ల్లో కనిపించి కామెడీ చేసింది.

కామెడీ స్టార్స్ నుండి ఈమెకు మాత్రమే కాకుండా మరో ఇద్దరికి కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక వైపు సెట్టింగ్‌ ను పునః నిర్మించడంతో పాటు మరో వైపు నాగార్జున పై ప్రోమోలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరితో ఒప్పందం కూడా అయ్యిందని తెలుస్తోంది. ఇక బిగ్‌ బాస్ సీజన్‌ 5 ను సెప్టెంబర్‌ లో ప్రారంభించే అవకాశం ఉంది. సీజన్‌ 4 ను కూడా గత ఏడాది సెప్టెంబర్‌ లో మొదలు పెట్టి ఏడాది చివరి వరకు పూర్తి చేశారు. ఈ సీజన్‌ ను కూడా అదే సమయంలో ప్రారంభించి ముగించబోతున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ కు రానా హోస్టింగ్‌ అంటూ వార్తలు వచ్చాయి. కాని అవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. నాగార్జున హోస్టింగ్‌ తో ఈ షో ను కంటిన్యూ చేస్తాడని అంటున్నారు. కరోనా కారణంగా ఈ సీజన్ ను కూడా అత్యంత జాగ్రత్తల మద్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.