Begin typing your search above and press return to search.
బిబి ఓటీటీ.. వాళ్ల ఎంట్రీ పై హాట్ స్టార్ క్లారిటీ
By: Tupaki Desk | 10 Feb 2022 8:32 AM GMTతెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులకు మళ్లీ సందడి మొదలు కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ను ఆధరించే వారు పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకే గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ 5 కి మంచి రేటింగ్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఓటీటీ సీజన్ ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. హిందీలో కూడా బిగ్ బాస్ ఓటీటీ వచ్చింది. కాని సాదారణ సీజన్ తో పోల్చితే బిగ్ బాస్ ఓటీటీని చాలా సింపుల్ గా చేశారు. హోస్ట్ విషయం మొదలుకుని అన్ని విషయాల్లో కూడా హిందీ బిగ్ బాస్ ఓటీటీ కాస్ట్ కటింగ్ చేశారు.
కాని తెలుగు బిగ్ బాస్ ఓటీటీకి అలా కాకుండా రెగ్యులర్ బిగ్ బాస్ రేంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ షో కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. సెట్ విషయంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో రాజీ లేకుండా ఓటీటీ బిగ్ బాస్ ను నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. ఈనెల చివరి వారంలో మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు సంబంధించిన లోగో ను ఆవిష్కరించారు.
గత కొన్ని రోజులుగా ఓటీటీ బిగ్ బాస్ లో మెజార్టీ కంటెస్టెంట్స్ పాత వారు అంటే గత బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న వారు ఉండబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు. 24/7 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అంటూ లోగోను విడుదల చేసి ఆసక్తిని కలిగించిన షో నిర్వాహకులు కొత్త పాత కాంబినేషన్ లో ప్రతి ఒక్కరిని కంటికి రెప్ప వేయకుండా ఎంటర్ టైన్ చేసే విధంగా షో ఉండబోతుంది అంటూ ప్రకటించారు.
ఇన్ని రోజులు పాత కంటెంస్టెంట్స్ ఎంట్రీ పై కాస్త అనుమానం ఉండేది. ఇప్పుడు అది తేలి పోవడంతో ఓటీటీ బిగ్ బాస్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ అంటే సోషల్ మీడియా సందడి షురూ అవుతుంది. ఒక్కో కంటెస్టెంట్స్ కు వేల కొద్ది ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో క్రియేట్ అవుతాయి. తద్వారా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.
ఈసారి బిగ్ బాస్ ఓటీటీ లో కనుక వివాదాలు అంతకు మించి ఉంటాయి అనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో షో లో రొమాన్స్ లు.. అమ్మాయిల అందాల ఆరబోత ఇలా ప్రతి ఒక్కటి కూడా ఓ రేంజ్ లో ఉంటుంది అంటున్నారు. ముమైత్ ఖాన్.. అషు రెడ్డి... అరియానా.. ధన్ రాజ్ లతో పాటు ఇంకా కొందరు పాత కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. గత సీజన్ కు చెందిన ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా ఉంటారని తెలుస్తోంది.
మొత్తానికి హిందీ ఓటీటీ బిగ్ బాస్ ను మించి తెలుగు ఓటీటీ బిగ్ బాస్ ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి షో ను 12 వారాల పాటు నిర్వహించాలని అనుకున్నారు. ఒక వేళ సక్సెస్ అయ్యి మంచి స్పందన వస్తే 15 వారాలు అంతకు మించి కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఓటీటీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రోజు అంతా హౌస్ లోని విషయాలు స్ట్రీమింగ్ చేయడంతో పాటు ప్రతి రోజు గంట లేదా గంటన్నర ఎడిటెడ్ వర్షన్ ను కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సరికొత్త గా ఈ షో ఉండబోతుంది కనుక ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈనెల 15 నుండి కంటెస్టెంట్స్ క్వారెంటైన్ ఉండబోతుంది. 26వ తారీకున షో ప్రారంభం కాబోతుందని సమాచారం అందుతోంది.