Begin typing your search above and press return to search.
#BB సీజన్ 5 ప్రత్యేకత అదే
By: Tupaki Desk | 31 Aug 2021 10:01 AM GMTతెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఆధరిస్తారా లేదా అనే అనుమానంతో సీజన్ 1 మొదలు పెట్టిన నిర్వాహకులు ప్రతి ఏడాది రెగ్యులర్ గా సీజన్ లు నిర్వహిస్తూ వస్తున్నారు. సీజన్ సీజన్ కు రేటింగ్ పెరగడం.. ఆదాయం పెరగడం జరుగుతుంది. దాంతో సీజన్ సీజన్ కు ఖర్చు కూడా పెంచుతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. గత రెండు సీజన్ ల కంటెస్టెంట్స్ విషయంలో కాస్త అసంతృప్తి విమర్శలు వచ్చాయి. పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో మీరు సెలబ్రెటీలను ఎంపిక చేయకుండా సోషల్ మీడియాలో గుర్తింపు ఉన్న వారిని తీసుకు వస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సీజన్ కు చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయట. అందులో ప్రధానమైన ప్రత్యేకత అంటే కంటెస్టెంట్స్. ఈసారి ఉన్న సెలబ్రెటీ కంటెస్టెంట్స్ గత సీజన్ ల్లో లేరని అంటున్నారు. ప్రతి కంటెస్టెంట్ కూడా జనాల్లో బాగా పాపులర్ అయిన వారే అంటున్నారు. గతంలో 40 శాతం మంది కంటెస్టెంట్స్ మాత్రమే జనాలకు తెలిసిన వారు.. మిగిలిన వారు కొద్ది మందిలో గుర్తింపు ఉన్న వారు మాత్రమే. ఈసారి దాదాపుగా 90 శాతం మందికి అన్ని వర్గాల జనాల్లో ప్రేక్షకుల్లో గుర్తింపు ఉందని అంటున్నారు. బుల్లి తెర మరియు వెండి తెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న వారికి మాత్రమే ఈ సారి అవకాశాలు వచ్చాయట.
ప్రముఖ సెలబ్రెటీలు కనుక పారితోషికం భారీగాను ఇస్తున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గత సీజన్ కు కంటెస్టెంట్స్ కు ఇచ్చిన పారితోషికం తో పోల్చితే దాదాపుగా 30 నుండి 40 శాతం పారితోషికం అధికంగా ఇస్తున్నారట. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మరింత స్పెషల్ గా తీసుకు వచ్చేందుకు మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఉపయోగదాయంగా ఉంటాయి అనేది చూడాలి. ఈ ఆదివారం నుండి సీజన్ 5 ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా కూడా క్వారెంటైన్ లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రెటీలు కూడా చాలా ఫేమస్ వారే అంటున్నారు. మొత్తానికి ఈ సీజన్ మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.