Begin typing your search above and press return to search.
#BB3 వార్ లోకి.. NBK- CHIRU ఒకే నెలలో బిగ్ ట్రీట్!
By: Tupaki Desk | 31 Jan 2021 12:55 PM GMTఒకే నెలలో నలుగురు అగ్ర హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి... విక్టరీ వెంకటేష్.. మాస్ మహారాజా రవితేజ .. ఈ ముగ్గురూ నటించిన సినిమాల రిలీజ్ తేదీల్ని ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు వార్ లోకి నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా దూసుకొచ్చారు. బాలయ్య బాబు #BB3 సడెన్ గా రిలీజ్ వార్ లోకి రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా హీటెక్కింది. బాలయ్య అభిమానుల్లో అప్పుడే సందడి వాతావరణం కనిపిస్తోంది. అన్నట్టు బాలయ్య రాకతో వార్ న్ సైడేనా? అసలు కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది? అన్నది విశ్లేషిస్తే...
ఒకే నెలలో చిరు- వెంకీ- బాలయ్య సినిమాలు రిలీజవ్వడం అన్నది అరుదైన సన్నివేశమని విశ్లేషించాలి. 90లలో మాత్రమే సాధ్యమైన ఫీట్ మళ్లీ ఇన్నాళ్టికి కనిపిస్తోంది. పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన ఆ ముగ్గురు సీనియర్ హీరోలు ఈ వేసవిలో అరుదైన ఘనతను చాటాలని ఉవ్విళ్లూరుతూ పోటీలోకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ ఈ చిత్రంలో 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో అదరగొట్టనున్నాడు. తండ్రీ కొడుకుల ఎంట్రీతో ఆచార్య పై భారీ హైప్ నెలకొంది. ఆచార్య రిలీజైన ఒక రోజు తరువాత అంటే.. మే 14 న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప తెరపైకి రానుంది. ఈ మూవీ తమిళంలో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ కావడం.. పైగా వెంకీ లుక్ కి అద్భుత స్పందన రావడంతో ఇప్పటికే హైప్ కనిపిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హుషారులో ఉన్నారు. ఆయన నటిస్తున్న ఖిలాడీ చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. మే 28న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయనున్నామని ఖిలాడీ టీమ్ ఇంతకుముందే ప్రకటించింది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ని అంతే ప్రతిష్ఠాత్మకంగా మే 28 న సినిమాహాళ్లలో రిలీజ్ చేస్తున్నామని బీబీ3 టీమ్ తాజాగా ప్రకటించడంతో ఒక్కసారిగా హీట్ రెట్టింపైంది. అనూహ్యంగా బాలయ్య రంగ ప్రవేశంతో ఒకే నెలలో నలుగురు హీరోల ట్రీట్ ఖాయమైంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య...నటసింహా బీబీ3 రిలీజ్ లకు రెండు వారాల గ్యాప్ ఉండడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. అయితే బీబీ3 కూడా ఖిలాడీ రిలీజవుతున్న రోజే వస్తోంది కాబట్టి ఆ మేరకు కలెక్షన్స్ పరమైన షేరింగ్ ఉంటుందని భావిస్తున్నారు.
సీనియర్ల నడుమ పోటీ వాతావరణం కనిపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే పరిశ్రమ అగ్ర హీరోల నాలుగు సినిమాలు 2 వారాల గ్యాప్ లోనే రిలీజవుతుండడంతో ఆ మేరకు తెలుగు సినీప్రియులకు వినోదం పీక్స్ కి చేరుకున్నట్టేననడంలో ఎలాంటి సందేహం లేదు.