Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే విషయం

By:  Tupaki Desk   |   16 March 2021 6:30 AM GMT
బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే విషయం
X
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబోలో మూవీ ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమాను ఇటీవలే షూటింగ్‌ పునః ప్రారంభించారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఒక విషయం అభిమానులకు ఆందోళన కలిగిస్తూనే ఉంది. అదేంటీ అంటే బాలయ్య ఈ సినిమాలో అఘోరా గెటప్ లో కొద్ది సమయం కనిపిస్తాడు. సినిమాకు ఆ సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది.

బాలయ్యను అఘోరాగా చూపించడం అంటే చాలా పెద్ద సాహసం. కాస్త అటు ఇటు అయితే సోషల్‌ మీడియాలో కాచుకు కూర్చున్న ఒక వర్గం వారు బాలయ్యను ఆడుకోవడం ఖాయం. బాలయ్య అఘోర గెటప్ ను చీల్చి చెండాటం ఖాయం అని నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి బాలయ్య అఘోర గెటప్ లో కనిపించబోవడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. లాక్‌ డౌన్ సమయంలో స్క్రిప్ట్‌ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా అఘోరా గెటప్ లేపేసి ఉంటారని అంటున్నారు. మొత్తానికి బాలయ్య అభిమానులు బోయపాటి నిర్ణయంతో ఊపిరి పీల్చుకుంటున్నారట.