Begin typing your search above and press return to search.
బిగ్ షాక్ ఇవ్వబోతున్న #BB3 టైటిల్?
By: Tupaki Desk | 12 April 2021 4:30 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాకి టైటిల్ ని ఫైనల్ చేయాలంటే దాని వెనక దర్శకనిర్మాతలు చిత్రబృందం ఎంతో తర్జనభర్జన పడాల్సి ఉంటుంది. ఆయన కెరీర్ బ్లాక్ బస్టర్ టైటిల్స్ ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్ఠంగా అర్థమవుతుంది. ఆయన కోసం ఇప్పటివరకూ దర్శకరచయితలు మోస్ట్ పవర్ ఫుల్ టైటిల్స్ ని ఎంపిక చేస్తారు. సమరసింహారెడ్డి- నరసింహానాయుడు - సింహా- లెజెండ్ - డిక్టేటర్.. ఇవన్నీ అలా పుట్టుకొచ్చినవే.
అందుకే ఇప్పుడు నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఇంతకాలం టైటిల్ ని ప్రకటించకుండా బీబీ 3 అంటూ బోయపాటి నాన్చేయడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎట్టకేలకు టైటిల్ ప్రకటించే సమయం ఆసన్నమైంది.
ఉగాది కానుకగా నేటి మధ్యాహ్నం 12.33 గంటలకు టైటిల్ ని ఘనంగా ప్రకటించనున్నారు. అయితే బాలయ్య హార్స్ ఫవర్ కి తగ్గట్టే ఈ టైటిల్ అంతే పవర్ ఫుల్ గా ఉంటుందా? అన్న సందిగ్ధత అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ బోయపాటి ఎలాంటి టైటిల్ ని ఫైనల్ చేశారో అన్న చర్చా వేడెక్కిస్తోంది.
టైటిల్ రోర్ తో ప్రమోషన్లు ప్రారంభమైనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుత అనిశ్చిత సమయంలోనూ రిలీజ్ తేదీ మే 28 అని ప్రకటించారు. ఈ తేదీపైనా నేడు మరింత స్పష్ఠత వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మే 28 అనేది బాలకృష్ణతో పాటు అభిమానులకు కూడా సెంటిమెంట్ డేట్ ఎందుకంటే ఇది లెజెండ్ ఎన్టీఆర్ జయంతి రోజు. అందుకే ఆ రోజు మూవీ రిలీజవుతుందని చెబుతున్నారు.
ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఇంతకుముందు వినిపించింది. కానీ ఇప్పుడు అఖండ అనే మరో టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ కాంబో సింహా - లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్లను అందించాక మూడో సారి కలిసి పని చేస్తున్నారు. అందుకు తగ్గట్టే టైటిల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ రెండిటిలో ఏది టైటిల్ అన్నది వేచి చూడాలి.