Begin typing your search above and press return to search.
బిబి4 : కలర్ ఫుల్ గా 'ప్రేమ మొదలైంది' ప్రీమియర్
By: Tupaki Desk | 25 Oct 2020 3:45 AM GMTఅభిజిత్ దర్శకత్వంలో అఖిల్.. మోనాల్.. అవినాష్.. అరియానా.. మెహబూబ్ లు కీలక పాత్రల్లో రూపొందిన ప్రేమ మొదలైంది సినిమా ప్రీమియర్ ను నిన్నటి ఎపిసోడ్ లో వేశారు. అంతకు ముందు రోజు ఎపిసోడ్ లో తెల్లవారు జామున రెండు మూడు గంటల వరకు సినిమాను చిత్రీకరించారు. చివరకు నిన్నటి ఎపిసోడ్ లో సినిమాను ప్రీమియర్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలో కథ గురించి సీన్స్ గురించి అంతగా తెలియలేదు. కాని నిన్నటి ఎపిసోడ్ లో సినిమాను చూపించగా బాగానే తీశారుగా అనిపించింది.
బిబి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో సినిమా సాగింది. కాలేజ్ లో విలన్ గా మెహబూబ్ కనిపించాడు. ఒక జంటగా అఖిల్.. మోనాల్ మరో జంటగా అవినాష్ మరియు అరియానా నటించారు. మద్యలో ఒక ఐటెం సాంగ్. దాన్ని సోహెల్ మరియు హారికలు చేశారు. సినిమా అన్నప్పుడు పాటలు.. ఫైట్ లు మరియు కామెడీ ఉండాలి. ఆ మూడు కూడా కలగలిపి ప్రేమ మొదలైంది అంటూ సినిమాను తీశారు. ఈ సినిమాకు కొరియోగ్రఫర్ గా అమ్మ రాజశేఖర్.. డీఓపీగా నోయల్.. కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ లాస్య.. అసిస్టెంట్ డైరెక్టర్ గా దివి వ్యవహరించింది. ప్రీమియర్ కు కలర్ ఫుల్ సెట్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి సభ్యులు అంతా కూడా కలర్ ఫుల్ గా అందంగా మెరిసి పోయారు.
సినిమా ప్రీమియర్ కు ముందు రెడ్ కార్పెట్ ఇంటర్వ్యూ ను అరియానా చేసింది. ఇంటి సభ్యులందరిని కూడా ఒకొక్కరు చొప్పున వస్తుండగా అరియానా వారితో మాట్లాడించింది. తనకు మంచి సమాధానాలు చెప్పిన వారికి బహుమానం కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ మొదలైందా అంటూ అరియానా ప్రశ్నించింది. మోనాల్ ఇంకా ప్రేమ మొదలు అవ్వలేదు అంటూ నవ్వేసింది. ఇక సినిమా ప్రీమియర్ తర్వాత కంటెస్టెంట్స్ డాన్స్ ఫెర్ఫార్మెన్స్ మరియు అవార్డు వేడుక కూడా జరిగింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అంతా కూడా కలర్ ఫుల్ గా సాగింది. నేడు సాయంత్రం ఆరు గంటలకు సమంత గెస్ట్ హోస్ట్ గా షో జరుగబోతుంది. మూడు గంటల పాటు సమంత సందడే సందడి. నాతో ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా ఉండదు అంటూ సమంత చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది.