Begin typing your search above and press return to search.
బిబి4 : మనసులో ఇంత పెట్టుకుని బయటకు నవ్వుతున్నారా?
By: Tupaki Desk | 18 Oct 2020 4:10 AM GMTబిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ సాదా సీదాగా సాగిపోయింది. ఇంటి సభ్యులు వారం అంతా చేసిన తప్పులను నాగార్జున మాట్లాడాల్సి ఉంటుంది. గత వారంలో ఎవరు ఎక్కవగా తప్పులు చేయక పోవడంతో ఎక్కువగా నాగార్జున క్లాస్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. అవినాష్ కు ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ అంటూ బిరుదు ఇచ్చి సోహెల్ పై అతడు అరవడంపై సున్నితంగా మందలించాడు. సంచాలకుడి నిర్ణయంను ఎవరు కూడా తప్పుపట్టకూడదు అంటూ నాగార్జున అందరికి కూడా సూచించాడు. ఆ తర్వాత అరియానాను కూడా సోహెల్ ను పొగరు అంటూ తిట్టినందుకు ఆమెకు కూడా సున్నితంగా చురకలు అంటించాడు. సోహెల్ కు ఆమెతో సారీ చెప్పించాడు. ఇక అంతకు ముందు వారంలో సోహెల్ కోపంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వారం మొత్తం చాలా కూల్ గా ఉన్నాడు. ఆ విషయంలో సోహెల్ ను నాగార్జున అభినందించారు.
ఒకొక్కరిని మందలించడం పూర్తి అయిన తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మరో ఇంటి సభ్యుడు ఏం అనుకుంటున్నాడు అనే విషయాన్ని నాగార్జున చెప్పగా అలా తమ గురించి ఎవరు అనుకున్నారు అనే విషయాన్ని ఊహించాల్సి ఉంటుంది. ఎవరైతే అలా అన్నారో వారి తలపై సుత్తితో ఒక్కటి కొట్టాల్సి ఉంటుంది. అవినాష్ నుండి ఇది మొదలు అయ్యింది. అవినాష్ ను క్రూరమైన మనస్థత్వం అంటూ ఒకరు రాశారు అది ఎవరు అంటూ నాగార్జున ప్రశ్నించాడు. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా అవినాష్ దివి వద్దకు వెళ్లి ఈమె రాసి ఉంటుందని అన్నాడు. అనుకున్నట్లుగానే దివి రాసింది. టాస్క్ సమయంలో తన విషయంలో ప్రవర్తించి తీరు కారణంగా అలా రాసినట్లుగా దివి వివరణ ఇచ్చింది.
మోహబూబ్ గురించి స్వార్థ పరుడు స్నేహంను వాడుకుంటున్నాడు అంటూ కుమార్ సాయి రాశాడు. లాస్య నవ్వు మోసపూరితంగా ఉంటుందని మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతుందని అమ్మ రాజశేఖర్ రాశాడు. అభికి అహంకారం కాస్త ఎక్కువ అంటూ దివి రాసింది. దానిని అఖిల్ లేదా మోనాల్ రాసి ఉంటారు అని అభి పొరపడ్డాడు. దివికి సభ్యత ఉండదని అవతలి వారి ఫీలింగ్స్ గురించి పట్టించుకోకుండా మాట్లాడుతుందని మోనాల్ రాసింది. అఖిల్ నిజాయితీ అనే ముసుగులో ఉంటాడు అంటూ అభిజిత్ రాశాడు. మోనాల్ అబద్దాల కోరు అంటూ కూడా అభిజిత్ రాశాడు. అమ్మ రాజశేఖర్ అందరిని ఏమార్చుతాడు అంటూ కూడా అభిజిత్ రాశాడు.
మొత్తానికి ఇంటి సభ్యులకు అవతలి వారిపై చాలానే ఉంది. కాని బయటకు మాత్రం వారితో నవ్వుతు ఉన్నారు. మాస్క్ లు మరింతగా తొలగి పోవడంతో ముందు ముందు మరెంతగా ఈ గేమ్ ఆసక్తికరంగా మారుతుందో చూడాలి. నిన్నటి ఎపిసోడ్లో లాస్య, హారిక, నోయల్ లు సేవ్ అయ్యారు. నేటి ఎపిసోడ్ లో కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా మీడియాసర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఏం జరుగబోతుందో చూడాలి.