Begin typing your search above and press return to search.

'బంగార్రాజు' కోసం కొత్త అవతారం ఎత్తిన BB5 బ్యూటీస్‌

By:  Tupaki Desk   |   10 Jan 2022 9:30 AM GMT
బంగార్రాజు కోసం కొత్త అవతారం ఎత్తిన BB5 బ్యూటీస్‌
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో సందడి చేసిన నటి లహరి మరియు ఆర్ జే కాజల్ లు బంగార్రాజు కోసం కొత్త అవతారం ఎత్తారు. నాగార్జున మరియు నాగ చైతన్యలు హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా ను సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ను విభిన్నంగా నాగార్జున అండ్ టీమ్ ప్రమోట్‌ చేస్తున్నారు. బంగార్రాజు ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్రత్యేక విమానంలో నాగార్జున.. నాగ చైతన్య మరియు కృతి శెట్టిలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలను బిగ్ బాస్ బ్యూటీ కాజల్‌ తీసుకుంది. రోజంతా కూడా బంగార్రాజు టీమ్ తో ముఖ్యంగా నాగార్జునతో ప్రైవేట్‌ జెట్‌ లో టైమ్‌ స్పెండ్‌ చేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. దాంతో వీరు ఎటు వెళ్లి ఉంటారు అంటూ అంతా అనుకున్నారు. కాని కేవలం ఇంటర్వ్యూ కోసం గాల్లో వీళ్లు ఎగిరినట్లుగా తేలిపోయింది. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న లహరికి ఇది మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు.

బంగార్రాజు ప్రమోషన్ లో కేవలం ఇంటర్వ్యూలు చేయడంతో లహరి పని పూర్తి అవ్వలేదు. ఆమె వరుసగా బంగార్రాజు ఈవెంట్స్ ను కవర్‌ చేస్తుంది. ప్రతి ఈవెంట్‌ లో కూడా ఆమె యాంకర్ గా వ్యవహరిస్తుంది. తాజాగా బంగార్రాజు ప్రమోషన్ లో భాగంగా మ్యూజికల్‌ నైట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. పలువురు అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు హాజరు అయ్యారు. ఆ మ్యూజికల్‌ ఈవెంట్‌ కు లహరి యాంకర్ గా వ్యవహరించింది. లహరి తో పాటు ఆర్‌ జే కాజల్ కూడా హోస్ట్‌ గా వ్యవహరించింది. కాజల్‌ ఆర్‌ జే గా ఇప్పటికే బాగా గుర్తింపు దక్కించుకుంది. కాని బంగార్రాజు సినిమా కోసం వీజే గా కూడా చేసింది. ముందు ముందు ఈమె నుండి మరిన్ని షో లు మరియు స్టేజ్ షో లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బిగ్‌ బాస్ ద్వారా నాగార్జునకు పరిచయం అయిన వీరిద్దరు. ఇలా బంగార్రాజు మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమానికి యాంకర్స్ గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. బిగ్‌ బాస్ లో సందడి చేసి.. తనకు నచ్చిన వారికి ఏదో ఒక విధంగా నాగార్జున సాయం చేయడం కెరీర్‌ కు హెల్ప్‌ చేయడం చేస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరు యాంకర్స్ గా మారేందుకు తనవంతు సాయం మరియు సహకారంను అందించాడు. బంగార్రాజు తర్వాత కూడా వీరిద్దరు యాంకర్స్ గా కొనసాగుతారా అనేది చూడాలి. లహరి యాంకర్‌ గా గుర్తింపు దక్కించుకోవాలని ఆశ పడుతుంది. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఆర్జే అయిన కాజల్ కూడా ఫుల్‌ టైమ్‌ యాంకర్ గా మారబోతుందా అనేది చూడాలి. మొత్తానికి ఈ బిగ్‌ బాస్ ముద్దుగుమ్మలకు బంగార్రాజు కొత్త ఇమేజ్ ను కట్టబెట్టాడు. మరి వారు దాన్ని ఎంత వరకు నిలుపుకుంటారు అనేది చూడాలి.