Begin typing your search above and press return to search.
బిబి5 ప్రేక్షకుల ట్రోల్స్ తో సారీ చెప్పిన కమెడియన్
By: Tupaki Desk | 23 Nov 2021 12:30 PM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 తాజా సండే ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. అందుకు గాను హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ మరియు కమెడియన్ సుదర్శన్ లు బిగ్ బాస్ సీజన్ 5 స్టేజ్ పై సందడి చేశారు. నాగార్జున ఇంటి సభ్యులకు వారిని పరిచయం చేయడం.. ఆ తర్వాత అనుభవించు రాజా సినిమా తాలూకు ట్రైలర్ ను చూపించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కో ఇంటి సభ్యుల గురించి వచ్చిన గెస్ట్ లు మాట్లాడుతూ వచ్చారు. కంటెస్టెంట్స్ కూడా గెస్ట్ లతో మాట్లాడారు. ఆ సమయంలో కమెడియన్ సుదర్శన్ అందరు కంటెస్టెంట్స్ పై ఏదో ఒక రకంగా పంచ్ లు వేస్తూ వచ్చాడు. కాజల్ విషయంకు వచ్చేప్పటికి అతడు మీరు అలిగినప్పుడు సన్నీ వచ్చి బతిమిలాడటం బాగుంది. మీ ఇద్దరి మద్య ఆ రొమాన్స్ బాగుందంటూ వ్యాఖ్యలు చేశాడు.
సుదర్శన్ వ్యాఖ్యలకు కాజల్ ఆ సమయంలో కాస్త షాక్ అయినట్లుగా ఎక్స్ ప్రెషన్ పెట్టింది. ఆ తర్వాత సన్నీ మరియు కాజల్ లు డాన్స్ వేశారు. అప్పుడే అక్క తమ్ముడు అంటూ సన్నీ క్లీయర్ చేసేలా మాట్లాడాడు. ఆ సమయంలో చాలా మంది సుదర్శన్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు. కాని కొందరు మాత్రం సోషల్ మీడియాలో సుదర్శన్ ను విమర్శిస్తున్నారు. ఒక పెళ్లి అయిన మహిళ గురించి మాట్లాడే తీరు అదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వ్యక్తితో ఆమె రొమాన్స్ బాగుంది అంటే అర్థం ఏం వస్తుంది.. వారి ఆట పై ప్రభావం పడేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొందరు సుదర్శన్ ను తప్పుబట్టారు.
తన వ్యాఖ్యలకు వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో మరీ ఆలస్యం చేసి వివాదం శృతి మించకుండా సుదర్శన్ వెంటనే స్పందించాడు. తాను తప్పుడు ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేను ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తో మాట్లాడాను. మొత్తం గంట సేపు మేము సరదాగా మాట్లాడుకున్నాం. కాని అందులో మీకు చూపించింది కేవలం అయిదు నిమిషాలు మాత్రమే. తాను ఏమీ ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదు. అందులో కొద్దిగే చూపించడం వల్ల అలా తప్పుడు సందేశం వస్తుందని ఆయన అన్నాడు. ఒక వేళ తన వ్యాఖ్యకు కాజల్ కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా సుదర్శన్ ఒక వీడియోను రికార్డు చేసి షేర్ చేశాడు. దాంతో వివాదం ఆరంభం అవ్వడంతోనే ముగిసి పోయింది.