Begin typing your search above and press return to search.

BBC వారు బాహుబలిని ఎత్తేశారు

By:  Tupaki Desk   |   7 May 2017 10:02 AM IST
BBC వారు బాహుబలిని ఎత్తేశారు
X
బాహుబలి 2 సినిమాను ఇప్పుడు తెలుగు సినిమా అనుకోవడం లేదు ఎవ్వరూ. ఒక ప్రపంచ స్థాయీ సినిమాని తెలుగువాడు తీసాడు అని చెప్పుకుంటున్నారు. అంతాలా బాహుబలి 2 సినిమాని ప్రపంచ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇంతటి గొప్ప ప్రశంస మరే ఇండియన్ సినిమాకి రాలేదు ఈ మధ్య కాలంలో. మన సినిమా గురించి మన మీడియా కవర్ చేయడం వేరు. ఒక తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ టి‌వి కవర్ చేయడం వేరు కదా.. ఇప్పుడు అదే జరిగింది. ఒక ఛానల్ ఆకాశానికి ఎత్తేసింది.

నోటెడ్ ఇంటర్నేషనల్ ఛానల్.. బి‌బి‌సి వాళ్ళు బాహుబలి సక్సెస్ ని బ్రాడ్ కాస్ట్ ఆరంభ సమయంలో అద్భుతంగా చెప్పారు. బాహుబలి పొందిన అసాధారణ విజయం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది అని అన్నారు. అక్కడి న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం బాహుబలి కిందటి వారంలో విడుదలైన సినిమాలలో యూ‌ఎస్ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు లో 3వ స్థానంలో ఉంది అని తెలిపారు. బాహుబలి ఒక వారం కలెక్షన్లు కిందటి వారం యూ‌కే లో టాప్ 10 సినిమాలో ఒకటిగా నిలిచింది. అలాగే తమిళ్ హిందీ తెలుగు వర్షన్ కూడా మంచి ఆదరణ పొందిందని అని చెప్పారు. బి‌బి‌సి వాళ్ళు బాహుబలిని దాన్ని వెనుక ఉన్న టీమ్ ని పొగడ్తలతో ముద్ద చేశారంతే. ఇండియన్ సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే సత్తాని ఇచ్చింది అని చెప్పారు.

బాహుబలి అక్కడ విడుదలై హాలీవుడ్ సినిమాని కొంత గందరగోళపెట్టింది. ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫురీయ్య్యెస్ 8.. గార్డ్యన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2 కి గట్టి పోటీ ఇచ్చింది. రాజమౌళి బాహుబలి యూ‌ఎస్ లో $13M కలెక్షన్లు చేసింది. తెలుగు సినిమాకు ఇప్పుడు ఒవెర్సెస్స్ లోకూడా గొప్ప మార్కెట్ ఏర్పడింది బాహుబలి వలన కాబట్టి.. మరో సారి.. సాహో బాహుబలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/