Begin typing your search above and press return to search.

BDay స్పెషల్‌ : పోకిరి - ఒక్కడు.... జల్సా - తమ్ముడు

By:  Tupaki Desk   |   27 Aug 2022 12:30 PM GMT
BDay స్పెషల్‌ : పోకిరి - ఒక్కడు.... జల్సా - తమ్ముడు
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా పోకిరి సినిమా ను భారీ ఎత్తున ప్రత్యేక షో లు వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా పోకిరి షో లకు మంచి స్పందన వచ్చింది. షో వేసిన ప్రతి చోట కూడా హౌస్‌ ఫుల్‌ అయ్యింది. దాంతో ఈ మధ్య ప్రతి స్టార్‌ హీరో యొక్క బర్త్‌ డే కు ఆయా హీరోల యొక్క సూపర్‌ హిట్‌ సినిమాలను రీ రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమా తో పాటు ఒక్కడు సినిమా ను కూడా స్క్రీనింగ్‌ చేశారు. పోకిరి స్థాయిలో కాకున్నా ఒక్కడు సినిమాకి కూడా భారీ ఎత్తున స్పందన దక్కింది. చిరంజీవి బర్త్‌ డే కు ఘరానా మొగుడు సినిమా ను స్క్రీనింగ్‌ చేశారు. మరి కొన్ని రోజుల్లో పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ బర్త్‌ డే రాబోతుంది. ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున జల్సా సినిమాను స్క్రీనింగ్‌ చేయబోతున్నారు.

జల్సా సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా స్క్రీన్స్ ల్లో స్క్రీనింగ్ చేయాలని అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే జల్సా సినిమా తో పాటు మరో సినిమా ను కూడా రంగంలోకి దించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్‌ సినిమాల్లో ఒకటి అయిన తమ్ముడు సినిమాను కూడా బర్త్‌ డే రోజు ప్రత్యేక షో లు వేయాలని అభిమానులు నిర్ణయించారు.

అభిమానుల కోసం అభిమాన సంఘాల నాయకులు జల్సా మరియు తమ్ముడు సినిమాలను భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా స్క్రీనింగ్‌ చేయబోతున్నారు. థియేటర్లలో ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అప్పట్లో సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అభిమానులు చాలా మంది అప్పటికి చిన్న పిల్లలు అయ్యి ఉంటారు. అందుకే వారు ఈ సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాలను చూసిన వారు కూడా మళ్లీ థియేటర్లలో ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దాంతో ఈ రెండు సినిమాల యొక్క రీ రిలీజ్ యొక్క షో లకు మంచి డిమాండ్‌ ఉంది. టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అవ్వడమే ఆలస్యం వెంటనే అమ్ముడు అవుతాయని అంటున్నారు. మహేష్ సినిమాలకు వచ్చిన స్థాయిలో పవన్ సినిమాలకు స్పందన రానుందా అనేది చూడాలి.