Begin typing your search above and press return to search.

RRR కీ సీన్ 6నెల‌ల ముందే లీక్ ఇచ్చారుగా

By:  Tupaki Desk   |   29 Sep 2019 3:10 PM GMT
RRR కీ సీన్ 6నెల‌ల ముందే లీక్ ఇచ్చారుగా
X
`బాహుబ‌లి` ఫ్రాంచైజీ త‌రవాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న ఈ సినిమాపై అంచనాలు స్కై హైలో వున్నాయి. వాటికి త‌గ్గ‌ట్టే అబ్బుర‌ప‌రిచే నేప‌థ్యం ఎంచుకున్న‌ రాజ‌మౌళి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి తిరుగుబాటు బావుటాని ఎగుర‌వేసిన విప్ల‌వ యోధుడు కొమరం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే సంచ‌నం సృష్టిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కీ సీన్ లీక‌యింది.

లీక్ చేసింది ఎవ‌రో కాదు సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి తాజాగా `సైరా` ప్ర‌మోష‌న్ కోసం ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో `ఆర్ ఆర్ ఆర్‌` కీ సీన్ సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టేసి షాకిచ్చారు. ఇటీవ‌ల త‌న స‌తీమ‌ణి సురేఖ‌తో క‌లిసి చిరు `ఆర్‌.ఆర్.ఆర్‌` సెట్ కి వెళ్లార‌ట‌. స‌న్నివేశం కోసం శ్ర‌మిస్తున్న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ని చూసి వారి గుండెలు బ‌రువెక్కిపోయాయ‌ట‌. ఆ స‌మ‌యంలో అల్లూరి సీతారామ‌రాజు తెల్ల‌వారికి వ్య‌తిరేకంగా స్వాతంత్ర పోరాటంలో భాగం కావ‌డానికి ముందు అత‌ని ప్రిప‌రేష‌న్ కి సంబంధించిన స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రామ్ చ‌ర‌ణ్ పై చిత్రీక‌రిస్తున్నాడ‌ట‌.

ఈ విష‌యాన్ని చిరు బ‌య‌ట పెట్ట‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` చిత్రంలోని ఆది పాత్ర చ‌నిపోయే స‌న్నివేశంతో పాటు ఆ త‌రువాత జ‌రిగే భావోద్వేగ స‌న్నివేశాల్ని చిరు బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. అదే త‌రహాలో `ఆర్ ఆర్ ఆర్‌`లోని కీల‌క స‌న్నివేశాన్ని రివీల్ చేయ‌డంతో సినిమాపైనా.. సినిమాలోని ఈ సీన్ పై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేస్తోంది. మెగాస్టార్ ఏ లీకిచ్చినా అది సినిమాకి క‌లిసొచ్చేదేన‌ని అర్థ‌మ‌వుతోంది. 2020 జూలైలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కానుంది.