Begin typing your search above and press return to search.
జాలీవో జింఖానా.. బీస్ట్ నుంచి క్లాసిక్ ట్యూన్
By: Tupaki Desk | 19 March 2022 4:25 PM GMTవిజువల్ గ్లింప్స్ అంటే ఏంటీ.. ? హుషారైన స్టెప్పులు ఊపు తెచ్చే మ్యూజిక్.. నాయకానాయికల జోష్ ఇవన్నీ కలిపితే విజువల్ గ్లింప్స్. ఇలాంటివి క్రియేట్ చేయడంలో ఇతరుల కంటే కాస్త ట్యాలెంటెడ్ అని ప్రూవ్ చేస్తున్నాడు అనిరుధ్ రవిచంద్రన్. ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ గయ్ ఏ ట్యూన్ ఇచ్చినా అది యూత్ లోకి దూసుకుపోతోంది. ఇంతకుముందే బీస్ట్ కోసం హబీబో అంటూ అరబిక్ సాంగ్ పాడించి బోలెడంత హైప్ తెచ్చాడు. పెప్పీ నంబర్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది.
ఇప్పుడు దళపతి విజయ్ బీస్ట్ నుంచి మరో క్లాసీ నంబర్ విడుదలైంది. జాలీ వో జింఖానా అంటూ సాగే ఈ పాట ఆద్యంతం అనిరుధ్ మార్క్ మ్యూజిక్ అలరించింది. ట్యూన్ కొత్తగా లేకపోయినా మెస్మరైజ్ చేసే డ్యాన్సింగులతో దళపతి మార్క్ సిగ్నేచర్ స్టెప్పులతో వైబ్రేంట్ గా కనిపిస్తోంది. పూజా హెగ్డే యథావిధిగా విజయ్ తో పోటీపడుతూ డ్యాన్సులు చేసేందుకు ప్రయత్నించింది. ఇక జానీ మాస్టర్ తనదైన శైలి కొరియోగ్రఫీ తో ఆకట్టుకున్నారు.
మృగం అధికారిక విడుదల తేదీ
2022 ఏప్రిల్ లో బీస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని దళపతి టీమ్ ప్రత్యేక పోస్టర్ తో అధికారికంగా ప్రకటించింది. అయితే నిర్మాణ సంస్థ ఖచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ ఇప్పటికే చర్చనీయాంశమైంది.
తమిళ నూతన సంవత్సర వారాంతంలో అంటే ఏప్రిల్ 13న దళపతి బీస్ట్ ని విడుదల చేసి మరో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్టు... మీడియా సర్కిల్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుండి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న హాట్ న్యూస్ ఏంటంటే.. సెన్సార్ పూర్తి కాగానే రిలీజ్ డేట్ ని అధికారికంగా వెల్లడించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... మరికొద్ది రోజుల్లో మృగం సెన్సార్ జరగనుంది. విడుదల తేదీని మోషన్ పోస్టర్ లేదా విజయ్, నెల్సన్ - అనిరుధ్ లతో కూడిన ప్రత్యేక వీడియోతో ప్రకటించవచ్చని కథనాలొస్తున్నాయి. ఆడియో లాంచ్ ఈవెంట్ లేనప్పటికీ వారు బీస్ట్ అప్ డేట్ ని చెబుతారని తెలిసింది. ప్రమోషనల్ వర్క్ డీటెయిల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి.
అపర్ణా దాస్,-సెల్వరాఘవన్- షైన్ టామ్ చాకో- యోగి బాబు- రెడిన్ కింగ్స్లే - సతీష్ కృష్ణన్ కూడా ఉన్నారు. మనోజ్ పరమహంస విజువల్స్- నిర్మల్ కట్స్ అందించిన బీస్ట్ కి అనిరుధ్ సంగీతం అందించారు. దళపతి విజయ్ స్వయంగా పాడిన రెండో సింగిల్ జాలీ ఓ జింఖానా దూసుకెళుతోంది.