Begin typing your search above and press return to search.
అరబిక్ స్టైల్లో `బీస్ట్` సాంగ్ ప్రయోగం..!
By: Tupaki Desk | 15 Feb 2022 3:28 AM GMTదళపతి విజయ్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి ప్రమోషన్ ని బిగ్ బ్యాంగ్ తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా అరబిక్ కుతు అనే మొదటి పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్ - జోనితా గాంధీ పాడారు. ఈ ట్రాక్ అరబిక్ ఫ్యూజన్ మిక్సింగుతో తమిళ కుతు జానపద బీట్ లతో సృజనాత్మకంగా అనిపిస్తుంది. సంగీతంలో పాశ్చాత్య బాణీ.. అరబిక్ పాటల రిథమ్ కోసం అనిరుధ్ తగిన పరిశోధన చేసినట్లు కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ సంగీతాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ పాట ఎంతో అందంగా కుదిరింది.
ఇక ఈ పాట ఆద్యంతం విజయ్ అద్భుతమైన నృత్యం అలరిస్తుంది. అలాగే పూజా హెగ్డే గ్లామర్ ఎలివేషన్ టెంప్టింగ్ మూవ్స్ మరో హైలైట్. జానీ మాస్టార్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. భాషతో సంబంధం లేకుండా హిప్నోటిక్ బీట్ లు అధునాతన టింజ్ తో మంత్రముగ్ధులను చేస్తుంది ఈ పాట. ఈ పాటకు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. అనిరుధ్ ఎంతో క్రియేటివ్ గా బాణీ సమకూర్చారు.
బీస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సోషల్ మీడియా సమాచారంమేరకు.. యష్ KGF: చాప్టర్ 2తో పోటీపడుతూ ఏప్రిల్ 14న బీస్ట్ థియేటర్లలో విడుదలకు రానుందని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత పూజా తమిళ సినిమాల్లో తిరిగి నటిస్తోంది. బీస్ట్ తర్వాత విజయ్ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెరకెక్కించే సినిమాకి సంతకం చేశారు. వంశీ పైడిపల్లి దళపతి 66కి దర్శకత్వం వహించనున్నారు.
`బీస్ట్` కెరీర్ బెస్ట్ అవుతుందా?
ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ సినిమాలు చేస్తూనే అటు కోలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. ఇదే సమయంలో అమ్మడు విమర్శలు అదే స్థాయిలో ఎదుర్కుంటోంది. పూజాతో సినిమా అంటే నిర్మాతలకు తడిపి మోపుడవుతుందని విమర్శలున్నాయి. మూడు కోట్లు పారితోషికంతో పాటు..నలుగురు పర్సనల్ బాడీ గార్డ్లు..ఒక చార్టెడ్ ప్లైట్ అన్ని ఏర్పాటు చేస్తేనే సెట్స్ కు వస్తుందని ఆర్కె. సెల్వమణి సంచలన ఆరోపణలు చేసారు.
దాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు నిర్మాత నట్టి కుమార్ కూడా పూజాపై నిప్పులు చెరిగారు. సినిమాకి పనిచేసిన కార్మికులకు కూడి డబ్బలు సరిగ్గా ఇవ్వరు..హీరోయిన్ కి మాత్రం ఇన్ని రకాల సౌకర్యాలా? ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు.

అయితే విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటూ.. పూజా తన పనిలో తాను ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ సరసన `బీస్ట్ `లో నటిస్తోంది. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రపీ అందిస్తుండగా..సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. కరోనా వేవ్ వల్ల అన్ని సినిమాల్లానే బీస్ట్ కూడా వాయిదా పడింది.