Begin typing your search above and press return to search.

అందంగా మెరిసిన అజిత్ ఫ్యామిలీ!

By:  Tupaki Desk   |   13 Jun 2022 10:31 AM GMT
అందంగా మెరిసిన అజిత్ ఫ్యామిలీ!
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. యాక్షన్ .. ఎమోషన్ ఏదైనా అజిత్ గొప్పగా చేస్తాడనే పేరుంది. అలాగే ఆయనకి మాస్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. అందువలన తన సినిమాల్లో వాళ్లకి నచ్చిన అంశాలు ఉండేలా అజిత్ చూసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన రికార్డులను తానే అధిగమిస్తూ అజిత్ ముందుకు వెళుతుంటారు. అజిత్ ఎక్కువగా బయట కనిపించరు. ఎలాంటి వివాదాస్పదమైన విషయాల్లోను ఆయన జోక్యం చేసుకోరు. తన పని తాను చూసుకుపోతుంటాడు.

ఇక అజిత్ తనకి సంబంధించిన అన్ని పనులను తానే చూసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అభిమానులపై ఆయన అసహనాన్ని ప్రదర్శించరనే పేరుంది. ఇక సామాజిక పరమైన సేవా కార్యక్రమాల విషయంలోను అజిత్ ముందుంటారు. అందువలన తెరపై హీరోగా మాత్రమే కాదు .. వ్యక్తిత్వం పరంగా కూడా ఆయనను అభిమానించేవారి సంఖ్య ఎక్కువే. ఎంతో సాన్నిహిత్యం ఉన్నవారి వేడుకలకు మాత్రం అజిత్ తన ఫ్యామిలీతో కలిసి హాజరవుతూ ఉంటారు.

క్రితం నెలలో ఏ ఆర్ రెహ్మాన్ కూతురు పెళ్లి జరిగింది. ఆ రిసెప్షన్ ను చెన్నై లో నిర్వహించారు. ఈ వేడుకకి అజిత్ భార్యా పిల్లలు .. మరదలు షామిలీ హాజరయ్యారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కి అజిత్ రాలేదు .. షూటింగులో బిజీగా ఉండటం వలన ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది.

షాలినీ సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక షామిలీ విషయానికి వస్తే, తెలుగు .. తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. చదువు పూర్తి చేయాలంటూ మధ్యలో బ్రేక్ తీసుకుని మళ్లీ వచ్చిందిగానీ .. అంత సీరియస్ గా దృష్టి పెట్టలేదు.

అజిత్ విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన చేసిన సినిమా 'వలిమై'. బోనీ కపూర్ నిర్మాణంలో సీహెచ్ వినోద్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. తమిళంలో తప్ప మిగతా భాషల్లో ఈ సినిమా అంతగా ఆడలేదు.

కోలీవుడ్ లో కూడా ఈ సినిమా నష్టాలూ తీసుకుని రాలేదు కానీ, అజిత్ స్థాయికి తగిన వసూళ్లు కాదని చెప్పుకున్నారు. అయినా తన తాజా చిత్రం కోసం అదే దర్శకుడితో కలిసి అజిత్ పనిచేస్తున్నారు. ఇది కూడా భారీ యాక్షన్ మూవీ కావడం విశేషం.