Begin typing your search above and press return to search.

బ్యూటిఫుల్ లవ్.. వాటే కూల్ మెలోడి

By:  Tupaki Desk   |   13 April 2018 2:00 PM GMT
బ్యూటిఫుల్ లవ్.. వాటే కూల్ మెలోడి
X
ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా బాగా ఊపుచ్చే పాటలే కాని.. కాస్త కూల్ గా సింపుల్ గా ఉండే మెలోడీలను అస్సలు వినట్లేదు. ముఖ్యంగా మన హీరోలకు డ్యాన్సులకు స్కోప్ ఉండాలి కాబట్టి.. వాళ్ళు కూడా బీట్స్ అండ్ రిథమ్స్ అంటూ కంపోజర్లను డిమాండ్ చేస్తున్నారు. కాని ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం రూటు మార్చాడనే అనుకోవాలి. ఈసారి ఏదో కొత్తగానే ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ కంపోజర్లు విశాల్ అండ్ శేఖర్ 'నా పేరు సూర్య' సినిమా కోసం అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది అనే చెప్పాలి. లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్యన జరిగే ప్రేమకథ ఎంత బ్యూటిఫల్ గా ఉంటుందోచెప్పడానికి.. ''బ్యుటిఫుల్ లవ్'' అనే పాటను సృష్టించారు. చాలా సింపుల్ గా కంపోజ్ చేయబడిన ఈ ట్యూన్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక అర్మాన్ మాలిక్ కూడా 'మన కథ బ్యూటిఫుల్ లవ్' అంటూ చాలా బాగా పాడేశాడు. ఆకట్టుకుంది అంతే. వాటే కూల్ మెలోడి అనుకోవాలి్సందే.

రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా డైరక్షన్ పగ్గాలు చేపట్టేసి.. ఈసినిమాతో డైరక్టర్ అవతారం ఎత్తనున్నాడు. ఇప్పటికే టీజర్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉండటంతో.. ఇప్పుడు అందరూ ట్రైలర్ ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా చూస్తున్నారు. మొన్న రిలీజ్ చేసిన డైలాగ్ కూడా బాగుంది కాబట్టి.. టీజర్ పైనే కళ్ళన్నీ. ఇకపోతే మే 4న సినిమా రిలీజవ్వనున్న సంగతి తెలిసిందే.

వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి