Begin typing your search above and press return to search.

'అఖండ' చిత్రంలోని బ్యూటిఫుల్ మెలోడీ.. 'అడిగా అడిగా'..!

By:  Tupaki Desk   |   18 Sep 2021 1:37 PM GMT
అఖండ చిత్రంలోని బ్యూటిఫుల్ మెలోడీ.. అడిగా అడిగా..!
X
నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ 'అడిగా అడిగా' లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు.

''అడిగా అడిగా.. పంచ ప్రాణాలు నీ రాణిగా.. జతగా జతగా.. పంచు నీ ప్రేమ పారాణిగా.. చిన్న నవ్వే రువ్వి మార్చేశావే.. నా తీరు నీ పేరుగా.. చూపు నాకే చుట్టు కట్టేశావే.. నన్నేమో సన్నాయిగా.. కదిలే కలలే.. కళ్ల వాకిళ్లలో కొత్తగా.. కౌగిలే ఓ సగం.. పొలమారిందిలే వింతగా'' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ మెలోడీ సాంగ్ కి ఎస్.ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. గాయకులు ఎస్పీ చరణ్ మరియు ఎంఎల్ శృతి కలసి ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి దీనికి మంచి సాహిత్యం అందించారు.

బాలకృష్ణ మరియు ప్రగ్యా జైస్వాల్ ఇద్దరూ త్వరలో జరగబోయే తమ వివాహం కోసం ఎదురుచూస్తున్నారనే సందర్భంలో 'అడిగా అడిగా' పాట చిత్రీకరించబడింది. ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తున్న వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద అందంగా కనిపించింది. ఒకరికొకరి మీదున్న అభిమానాన్ని తెలియజేసుకునేలా సాహిత్యం ఉంది. ఇందులో ప్రొడక్షన్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. వివాహానికి ముందు వేడుకలు ఆహ్లాదకరంగా క్యాప్చర్ చేయబడ్డాయి. రామ్ ప్రసాద్ దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

'అఖండ' సినిమాలోని ఈ మెలోడీ సాంగ్.. అతి తక్కువ సమయంలో చార్ట్ బస్టర్ అవుతుందని చెప్పవచ్చు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు - శ్రీకాంత్ - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.