Begin typing your search above and press return to search.
2020 బ్యాడ్ స్టార్ట్ కాకూడదు ఆర్జీవీ
By: Tupaki Desk | 20 Dec 2019 4:20 AM GMTకొత్త సంవత్సరం ఎలా ప్రారంభం కాబోతోంది? 2019 మిశ్రమ ఫలితాల తో ఓకే అనిపించింది. గడిచిన కాలంలో ప్రయోగాలు పెరిగాయి. సాహో లాంటి పాన్ ఇండియా చిత్రం రిలీజై నెగెటివ్ రిజల్ట్ తో నిరాశపరిచింది. మరి 2020 పరిస్థితి ఏమిటి? అంటే సంక్రాంతి సినిమాలతో కొత్త కళ రానుంది. దర్శకధీరుడి RRR రిలీజ్ తో పాన్ ఇండియా కళను సంతరించుకోనుంది. అయితే వీటన్నిటికంటే ముందే జనవరి 1 ట్రీట్ ఎలా ప్లాన్ చేశారు? తొలివారం సన్నివేశమేమిటి? అంటే.. అబ్బే! అని పెదవి విరిచేస్తున్నారు.
కొత్త సంవత్సరం బ్యాడ్ స్టార్ట్ తప్పదేమో! అని విశ్లేషిస్తున్నారు. అందుకు కారకులెవరు అంటే... నాశిరకం సినిమాలు తీస్తూ.. వరుస పరాజయాలతో బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న ఆర్జీవీ సినిమా రిలీజ్ కాబోతోందన్నదే ఇబ్బందికర పరిస్థితి. లక్ష్మీస్ ఎన్టీఆర్ - అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలతో వివాదాల్ని తేవడమే గాక.. బ్యాడ్ సినిమాల్ని తీశాడన్న విమర్శలు వచ్చాయి. 2020 జనవరి 1న `బ్యూటిఫుల్` అనే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఈసారి రాజకీయాల్ని టచ్ చేయకపోయినా.. రొమాంటిక్ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. `రంగీలా` చిత్రానికి ట్రిబ్యూట్! అంటూ వర్మ ఇప్పటికే హంగామా చేస్తుండడం ఆసక్తికరం.
జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేములో నైనా గంగూలీ రెచ్చిపోయి చేసిన గ్లామర్ షో నే కనిపిస్తుందట. సక్సెస్ లేక వివాదాల చుట్టూ సినిమాలు చేస్తున్న వర్మ `బ్యూటిఫుల్` విషయంలో సెక్సీ హీరోయిన్ అందాల ఎలివేషన్ నే నమ్ముకున్నాడని పోస్టర్లు విజువల్స్ చెబుతున్నాయి. అందాల్ని యూత్ కు ఎరవేయడం కోసమే ఈ సినిమాని వర్మ తీసినట్టుగా కనిపిస్తోంది. హద్దుమీరిన నైనా గంగూలీ గ్లామర్ షోని చూసి తట్టుకోలేక సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇలాంటి సినిమాతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం వెరీ బ్యాడ్ అంటూ ఓ సెక్షన్ విమర్శిస్తోంది. మరి ఆర్జీవీ ఇలాంటి నిర్ణయం ఎందుకని తీసుకున్నారో!