Begin typing your search above and press return to search.

బ్యూటీ కాన్పిడెన్స్.. స‌న్నికోసం ఏదోరోజు దిగోస్తారు!

By:  Tupaki Desk   |   20 Aug 2022 11:40 AM GMT
బ్యూటీ కాన్పిడెన్స్.. స‌న్నికోసం ఏదోరోజు దిగోస్తారు!
X
బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ గ‌తం గురించి తెలిసిందే. పోర్న్ ఇండ‌స్ర్టీ నుంచి బాలీవుడ్ కి దిగుమ‌తి అయింది. హిందీ సినిమాకి ముందు పోర్న్ జీవితంలో ఎన్నో చేదు ఘ‌ట‌నుల‌న్నాయి. అవ‌న్నీ దాటుకుని బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆరంభంలో ఇక్క‌డా ఇబ్బందులు త‌ప్ప‌లేదు. కొత్త న‌టి...పైగా శృంగార తార ముద్ర! అమ్మ‌డి జీవితం పై చాలా ప్ర‌భావాన్ని చూపించింది.

అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ముందుకొచ్చే వారు కాదు. క‌నీసం న‌టిగా నిరూపించుకుందామ‌న్నా? పోర్న్ ముద్ర వేసి నువ్వేం న‌టివి అని సైతం అవ‌మానాలు భ‌రించింది. కానీ క‌ష్టే ఫ‌లి అని న‌మ్ముకుని నేడు బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించ‌కుంది. అక్క‌డ‌ నుంచి సౌత్ ప‌రిశ్ర‌మ వైపు ట‌ర్న్ తీసుకుంది.

తెలుగులో సైతం న‌టించింది. నేడు త‌న‌పైనే 100 కోట్లు పెట్టుబ‌డి పెట్టి సినిమాలు నిర్మించ‌డానికి నిర్మాత‌లు ముందుకొస్తున్నారు. అలాంటి స‌న్న‌లియోన్ గ‌తాన్ని త‌లుచుకుని వాపోయింది."నేను ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన‌ప్పుడు నాతో క‌లిసి ప‌నిచేయ‌డానికి చాలా మంది వెనుక‌డుగు వేసేవారు. కానీ అదే స‌మ‌యంలో న‌టించేదుకు ఆస‌క్తి చూపించ‌న వారున్నారు.

అయితే పేరున్న వ్య‌క్తులు..నిర్మాణ సంస్థ‌లు ఇప్ప‌టికీ నాతో సినిమాలు చేయాలంటే ఆలోచించుకుంటారు. అయినా ఇదేం నాకు బాధ‌గా అనిపించ‌దు. ఎన్నో అనుభ‌వించి వ‌చ్చిన దాన్ని. ఒక స‌మ్య‌ని ఎలా అధిగ‌మించాలో జీవితం నేర్పింది. ఏదో ఒక రోజు నన్ను వ‌ద్ద‌న్నవారే వెదుక్కుంటూ నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు అన్న న‌మ్మ‌కం ఉంది" అన్నారు.

అలాగే ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని గుర్తు చేసుకుంది. 2012 లో బాలీవుడ్ కి వ‌చ్చా. అప్ప‌టికి నాలో ఇంకా పాత స‌న్నిలియెన్ ఉండేది. కానీ ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత జీవితాన్ని మార్చుకోవాల‌ని గొప్ప‌గా ఊహించుకుని న‌న్ను నేను మార్చుకున్నాను. ప‌రిశ్ర‌మ అంటే ఎంతో గౌర‌వం. న‌టించిన అన్ని పాత్ర‌ల‌కు నాకోంతో సంతృప్తిని అందించాయి.

కొన్ని చెత్త పాత్ర‌లు కూడా ఉన్నాయి. మంచి వ్య‌క్తుల్ని క‌లుసుకుని వాళ్ల‌తో మాట్లాడే అవ‌కాశం నాకు ద‌క్కింది. ఇదీ నా ఇల్లే అన్న విష‌యాన్ని బాగా అర్ధం చేసుకున్నాను అని అంది. ప్ర‌స్తుతం స‌న్నిలియోన్ బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే కొన్ని క‌న్న‌డ‌..త‌మిళ సినిమాలు చేస్తోంది. ఏడాది షెడ్యూల్ అంతా బిజీగానే క‌నిపిస్తుంది. తెలుగులోనూ స‌న్నితో సినిమాలు చేయ‌డానికి కొంత మంది నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు.