Begin typing your search above and press return to search.

ఆ క‌వ్వింపు చ‌ర్యేంటి కేతిక‌?

By:  Tupaki Desk   |   22 Jun 2022 1:20 PM GMT
ఆ క‌వ్వింపు చ‌ర్యేంటి కేతిక‌?
X
'రొమాంటిక్' బ్యూటీ కేతిక శ‌ర్మ రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మొద‌టి సినిమాతోనే అమ్మ‌డు రొమాన్స్ ఓ రేంజ్లో పండిచింది. హ‌ద్దుల‌..స‌రిహ‌ద్దులు లేవ‌ని తొలి సినిమాతోనే నిరూపించింది. హీరోతో పెద‌వి ముద్దులు..చిట్ట‌లిపొట్టి దుస్తుల్లో త‌న‌దైన గ్లామ్ షోని రొమాంటిక్ లో ఆవిష్క‌రించింది. ఆ ర‌కంగా అందాల ఆర‌బోత‌లో ఎలాంటి స‌రిహ‌ద్దులు లేవ‌ని సంకేతాలు ముందుగానే పంపేసింది.

ఇక సోష‌ల్ మీడియాలో అమ్మ‌డి గ్లామ్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంటుంది? ఆఫ్ ది స్ర్కీన్ అయినా అదే రేంజ్ లో కేతిక మెర‌పులు త‌ధ్యం అని టైమ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రుజువు చేస్తూనే ఉంది. తాజాగా మ‌రోసారి త‌న‌దైన మార్క్ క‌వ్వింపు చ‌ర్య‌తో యువ‌త‌లో గుండెల్లో మంట‌లు పుట్టిస్తోంది. కేతిక గార్జియ‌స్ లుక్ ఒక‌టి నెట్టింట దుమారం రేపుతోంది.

ఇందులో కేతిక ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ లో త‌ళుకులీనింది. సోఫాలో కూర్చున్న అమ్మ‌డు క్లేవేజ్ అందాల‌తో..థై షోతో ధమ్ ధ‌మ్ చేస్తోంది. కాలు మీద కాలేసుకుని క్యామ్ కి ఇచ్చిన ఫోజు మ‌రింత గుబులు పుట్టిస్తోంది. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో యువ‌త‌ని ఇలా ఇన్ స్టాలో హీటెక్కించ‌డానికి శ‌మ‌ర శంఖం పూరించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఆఫోటోపై కేతిక హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీని పోస్ట్ చేసి కుర్రాళ్ల‌లోకి వ‌దిలేసింది.

ఇంకేముందు ఆ స్నాప్ ఇన్ స్టా వేదిక‌గా వాయు వేగంతో దూసుకుపోతుంది. కుర్రాళ్లు అన్ లిమిటెడ్ ఫైర్ ఎమోజీల‌ను పోస్ట్ చేసి త‌మ‌లోని తాపాన్ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. అమ్మ‌డికి ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 1.2 మిలియ‌న్ మంది అనుస‌రిస్తున్నారు. మ్యాక‌ప్ వేసుకోవాడ‌నికి ముందే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. తెలివిగా ఇప్పుడా పాపులారిటీని ఎన్ క్యాస్ చేసుకుంటోంది.

అయితే న‌టిగా ఇంకా అంత బీజీ కాలేదు. తొలి సినిమా గుర్తింపుతో 'ల‌క్ష్య‌'లో అవ‌కాశం అందుకుంది. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'రంగ రంగ వైభ‌వంగ‌'లో న‌టిస్తోంది.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. ఆశ‌ల‌న్నీ ఈ రెండు సినిమాల‌పై ఉన్నాయి. హిట్ కొట్టి రేసులో దూసుకోవాల‌ని క‌ల‌లు కంటోంది. మ‌రి అవి సాధ్య‌మ‌వుతాయా? లేదా? అన్నది కాల‌మే నిర్ణ‌యించాలి.